రవిబాబు 'నచ్చావులే' స్టోరీ లైన్

By Staff

Ravi Babu
ఉషాకిరణ్ బ్యానర్ పై చిరకాల విరామం తర్వాత అల్లరి రవిబాబు అంతా కొత్త వారితో రూపొందిస్తున్న చిత్రం నచ్చావులే. ఈ చిత్రంలో కథ ఓ వేసవి సెలవుల సమయంలో మొదలవుతుంది. ఎమ్‌సెట్‌ రాసి ఫలితాల కోసం వేచి చూస్తూంటాడు హీరో. అప్పుడనితినో ఓ అందాల అమ్మాయి పరిచయమవుతుంది. అక్కడనుంచి కథ ప్రేమ కథగా టర్న్ తీసుకుంటుంది.ఇక ఈ టీనేజ్ లవ్ స్టోరీ స్పెషల్స్ గురించి చెబుతూ రవిబాబు సాధారణంగా ఫలానా తరహా ప్రేమ అని ఎవరూ ప్రేమను విభజించి చెప్పలేరు. ప్రేమ అనేది నిర్వచనానికి అందని భావన. యువతియువకుల మధ్యన ఉన్నదే ప్రేమ అని ప్రతి ఒక్కరూ భ్రమిస్తుంటారు.

నా 'నచ్చావులే' చిత్రం మాత్రం అందుకు దూరంగానే ఉంటుంది. అమ్మానాన్నలు బిడ్డలపై చూపించే మమకారం కూడా మన జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఆ మమకారాన్ని మనం యుక్త వయసులో సరిగ్గా అర్థం చేసుకోలేం. సరిగ్గా ఆ సమయంలో పరిచయమైన అమ్మాయితో మాటామాటా కలిస్తే అంతా కొత్తకొత్తగా అనిపిస్తుంది. ఈ సందిగ్ధావస్థ కూడా చాలా తమాషాగా, గుర్తు చేసుకొంటే సరదాగా అనిపిస్తుంది కదా. నచ్చావులే చూస్తే అలాంటి జ్ఞాపకాలు ప్రతి ప్రేక్షకుడికీ గుర్తుకొస్తాయి అంటున్నారు.అలాగే ఈ సున్నితమైన ప్రేమ కథలో కుటుంబ బంధాల విలువను చెబుతూ కావల్సినంత వినోదాన్ని పండిస్తాను అంటున్నారాయన. ఇలాంటి ప్రేమ కథో ఊహించుకోండి. లేదా రిలీజయ్యే దాకా ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X