twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ హీరోలకు టోపీ.. ఏకంగా ఆమె వలలో ముగ్గురు.. పరుగులు పెట్టించిన కిలాడీ లేడీ!

    |

    టాలీవుడ్ హీరోలు సహా చాలా మందిని బోల్తా కొట్టించిన వ్యాపార‌వేత్త, సినీ నిర్మాత శిల్పా చౌద‌రీని పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కిలాడి శిల్ప వ‌ల‌లో మోస‌పోయిన వారి జాబితాలో ముగ్గురు హీరోలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

    పోలీసులకు ఫిర్యాదు

    పోలీసులకు ఫిర్యాదు

    హైదరాబాద్‌లో ప్రముఖులను మోసం చేస్తున్న శిల్పా చౌదరి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల, సహా ప్రజా ప్రతినిధుల నుంచి శిల్ప డబ్బులు తీసుకుని మోసం చేసింది అంటూ ఫిర్యాదు రావడంతో నార్సింగి పోలీసులు రంగంలోకి దిగారు. శిల్ప తన వద్ద నుంచి కోటి రూపాయలకు పైగా డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని దివ్య అనే మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    అధిక వడ్డీ రేట్లు ఇస్తానని

    అధిక వడ్డీ రేట్లు ఇస్తానని

    ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు..గండిపేట సిగ్నేచర్ విల్లాస్‌లో నివాసం ఉంటున్న శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకన్నారు. ఈ క్రమంలో దివ్య వద్ద నుంచి శిల్ప డబ్బులు తీసుకుని చెల్లించలేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. అనంతరం వారిద్దరని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శిల్ప బాధితుల్లో ముగ్గురు టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీకెండ్ పార్టీ, కిట్టి పార్టీ పేరుతో సెలబ్రిటీలతో స్నేహం చేసే శిల్ప.. అధిక వడ్డీ రేట్లు ఇస్తానని చెప్పి రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు దండుకుని మోసం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

    14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

    14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

    శిల్ప ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుసుకున్న పలువురు బాధితులు ఆమెపై ఫిర్యాదు చేసేందుకు క్యూ కట్టినట్టుగా తెలుస్తోంది. ఒక ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఆయన భార్య కూడా శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. శిల్పా అరెస్టు రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. శిల్పతో పాటు ఆమె భర్త ను కూడా అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీసులు రిమాండ్ కు తరలించారు. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు విధించగా జైలుకు తరలించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో పెద్ద మొత్తంలో శిల్ప డబ్బులు గుంజినట్లు పోలీసులు గుర్తించారు.

    బౌన్సర్ తో బెదిరించి

    బౌన్సర్ తో బెదిరించి

    సైబరాబాద్ పరిధిలో అధునాతన హంగులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మోసం చేసిందని, రియల్ ఎస్టేట్ పేరుతో దివ్య రెడ్డి నుంచి కోటిన్నర పైగా వసూలు చేసిన శిల్ప డబ్బులు ఇవ్వకుండా, స్థలాన్ని చూపెట్టకుండా ఇబ్బందులకు గురి చేసినట్లు చెబుతున్నారు. డబ్బులు ఇవ్వాలని అడిగితే బౌన్సర్ తో శిల్ప బెదిరించినట్టు చెబుతున్నారు.

    పరుగులు పెట్టించి

    పరుగులు పెట్టించి

    డబ్బుల కోసం ఇంటికి వెళితే బౌన్సర్ తో బెదిరించి పరుగులు పెట్టించిన శిల్ప, డబ్బులు ఇవ్వమని అడిగితే ప్రముఖుల పేర్లు చెప్పి బెదిరింపులకు పాల్పడినట్టు దివ్య రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బులు ఇవ్వకుండా ఫోన్ లో చాలా సార్లు చంపేస్తానంటూ బెదిరింపులకు దిగిన శిల్ప నుంచి ప్రాణభయం ఉందంటూ పోలీసులను దివ్య రెడ్డి ఆశ్రయించింది. సుమారు 200 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల పేరుతో కుచ్చు టోపీ పెట్టిన‌ట్లు ప్రచారం జరుగుతూ ఉండగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రిన్ని విష‌యాలు అందాల్సి ఉంది.

    English summary
    Telugu film producer Shilpa arrested on cheating charges in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X