యూఎస్‌లో తెలుగు నిర్మాత సెక్స్ దందా.. సంపూనకు అవమానం.. మోసపోవద్దని ముందే హెచ్చరిక!
షూటింగ్‌ల పేరుతో తెలుగు హీరోయిన్లను వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నారనే ఆరోపణలపై అమెరికాలోని ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత మొదుగుముడి కిషన్, అతని భార్య చంద్రను చికాగో పోలీసులు అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. ఇప్పటికే వివాదాస్పద నటి శ్రీరెడ్డి వ్యవహారంతో టాలీవుడ్ ప్రతిష్ట బజారుకెక్కింది. ఈ నేపథ్యంలో అమెరికాలో సెక్స్ రాకెట్ బయటపడటంతో మరోసారి టాలీవుడ్ అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ సెక్స్ రాకెట్ గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన భయంకరమైన విషయాలు ఇవే..

ఏప్రిల్‌లోనే అరెస్ట్
సెక్స్ రాకెట్ కుంభకోణంలో కిషన్ దంపతులను ఏప్రిల్ చివరివారంలోనే అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వ్యవహారం బుధవారం అమెరికాలోని స్థానిక మీడియా కథనాలు వెల్లడించడంతో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ సెక్స్ కుంభకోణంలో కిషన్ దంపతులపై ఫెడరల్ పోలీసులు 42 పేజీల చార్జిషీట్‌ను చికాగో డిస్ట్రిక్ట్ కోర్టు దాఖలు చేసింది.

బలవంతంగా వ్యభిచారం
ప్రముఖ వ్యాపారవేత్త కిషన్ దంపతులు పలువురు హీరోయిన్లను బలవంతంగా వ్యభిచారంలోకి దింపినట్టు చార్జిషీట్‌లో అభియోగాలు నమోదయ్యాయి. అమెరికాలో వీరు హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్‌ను నడుపుతున్నట్టు విచారణలో బయటపడింది. వీరి అరెస్ట్ నేపథ్యంలో అమెరికాలోని తెలుగు సంఘాలు నివ్వెరపాటుకు గురయ్యాయి.

అమెరికాలో ఈవెంట్ల పేరుతో
యూఎస్‌లో జరిగే సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో హీరోయిన్లను రప్పించి ఈ చర్యలకు పాల్పడినట్టు విచారణలో బయటపడ్డాయి. ఒక్కో క్లయింట్ వద్ద సుమారు రూ.3 వేల (సుమారు రూ.2 లక్షలు) డాలర్లు వసూలు చేసేవారని తెలిసింది.

తాత్కాలిక వీసాలతో సెక్స్ దందా
తాత్కాలిక వీసాలపై సుమారు ఐదుగురు హీరోయిన్లను రప్పించి బలవంతంగా ఓ పాడుబడిన గదిలో లేదా నాసిరకం అపార్ట్‌మెంట్‌లో పెట్టేవారనే విషయాన్ని ఫెడరల్ పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. చికాగోలోని బెల్‌మౌంట్ క్రాగిన్ సమీపంలో ఈ వ్యభిచారం దందా జోరుగా సాగించేవారని వెల్లడైంది. అంతేకాకంుడా డల్లాస్, న్యూజెర్సీ, వాషింగ్టన్‌లో జరిగే సదస్సుల సందర్భంగా ఆ ప్రాంతంలోనే విటుల కోసం ఏర్పాట్లు చేసేవారని తెలిసింది.

దందా లెక్కలు తేల్చేది ఇలా
హీరోయిన్లను రప్పించడానికి ఎంత ఖర్చు అయింది. వారి వల్ల ఎంత ఆదాయం వచ్చింది. ఎవరికి ఎంతెంత ఇచ్చాం అనే వివరాలను కిషన్ భార్య చంద్ర రిజిస్టర్‌లో నమోదు చేసేవారనే విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. చికాగోలోని వెస్ట్ బెల్డెన్ అవెన్యూలోని ఫెడరల్ పోలీసుల సోదాలు నిర్వహించగా ఈ రిజిస్టర్లు చిక్కినట్టు అధికారులు పేర్కొన్నారు.

సంపూకు అవమానం ఇలా
అమెరికా తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సినీ హీరో సంపూర్ణేష్ బాబును నిర్మాత శ్రీరాజ్ చొన్నుపాటి అవమానించారని అప్పట్లో ఓ వార్త సంచలనం రేపింది. తనకు జరిగిన అవమానం కారణంగా తాను ఆ కార్యక్రమానికి హాజరుకావడం లేదని సంపూ ట్వీట్ చేశారు. అయితే ఆటా నిర్వాహకుల కోరిక మేరకు సంపూ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినట్టు ఓ వార్త ప్రచారంలో ఉండింది.

అనసూయ మద్దతు
శ్రీరాజ్ చెన్నుపట్టి చేసిన అవమానం నేపథ్యంలో యాంకర్ అనసూయ మద్దతుగా నిలిచారు. అందుకు నా ధన్యవాదాలు అని సంపూ తన ట్వీట్‌లో పేర్కొనడం కూడా జరిగింది. మధ్యవర్తులను నమ్మి సినీ తారలు మోసపోవద్దని సంపూ తన ట్వీట్‌లో హెచ్చరించడం గమనార్హం.

మొదుగుముడి కిషన్ అలియాస్ శ్రీరాజ్ చొన్నుపట్టి
వ్యాపారవేత్తగా డబ్బు సంపాదించిన తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించారు. నిర్మాత ముసుగులో సెక్స్ దందా సాగించారనేది తాజా ఆరోపణ. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించినట్టు కథనాలు వస్తున్నాయి. కానీ వాటి వివరాలు అందుబాటులోకి రావడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











