అది లేకుండా కష్టమే..అనూష్క
తనకు ఆనందం, చిరాకు రెండూ కంటిన్యూగా కలిగించేది మొబైల్ అంటోంది అనూష్క. సెల్ సిగ్నల్స్ ప్రాబ్లం వస్తే ఎలాంటి సమస్య వస్తుందో చెప్తూ..సాదారణంగా సెల్ పోన్ తో ఎంత సౌకర్యం ఉంటుందో అంతే ఇబ్బందులూ ఉన్నాయి. రాంగ్ కాల్స్ తో సమస్య. ఇక మెసేజ్ ల గురించి వేరే చెప్పనవసరం లేదు. అయినప్పటికీ సెల్ ఫోన్ విషయంలో అవన్నీ చాలా చిన్నవి. అన్నిటికంటే మొబైల్ కు ఏదైనా ఇబ్బంది ఎదురయ్యిందంటే చాలా సమస్యలొస్తాయి. పర్శనల్ సెల్ ఫోన్ విషయంలో మరింత కేర్ ఉండాల్సిందే. మెబైల్ కు ఏదైనా జరిగితే మొత్తం కమ్యూనిషన్ ఆగిపోయి మిగతా విషయం గురించి చెప్పాల్సిన పనిలేదు. సెల్ ఫోన్ ఒక్కోసారి హ్యాపీ న్యూస్ చెప్పి ఆనందం కలిగిస్తే ఇబ్బందలు వచ్చేటప్పుడు చిరాకు కలిగిస్తుంది అని చెప్పుకొచ్చింది.
ఇక ఇదే విషయంపై నయమతార మాట్లాడుతూ సెల్ ఫోన్ ఆగిపోనక్కర్లేదు. అది చేతిలో లేదా బ్యాగ్ లో లేదని గుర్తొస్తే చాలా. ఇక ఏ ఆలోచనా రాదు. అలాంటి పవర్ మొబైల్ ది అంది. ఛార్మి మాట్లాడుతూ ఒక్కసారి సెల్ ఫోన్ కు ఏదైనా జరిగి ఇబ్బంది పడితే ప్రపంచం ఆగిపోతుందనిపిస్తుంది. నా వరకూ కష్టం అంది. అలాగే ఎన్టీఆర్ అయితే ఊహించటానికే కష్టం అంటున్నాడు. రామ్ చరణ్ తేజ మొబైల్ నా ఫేరవేట్. అలాంటి సెల్ ఫోన్ కు కొన్ని సెకన్ల కాలం ఏం జరిగినా కష్టమేనంటున్నాడు. అల్లు అర్జున్ మరీ తీవ్రగా స్పందిస్తున్నాడు. మన పనులన్ని సెల్ ఫోన్ ద్వారానే. ఒక సారి ఆ ఫన్ మిస్సయితే ఆ భాధ వర్ణించలేను. మొమరీ రీ కలెక్టు చేసుకోవటం చాలా కష్టం. అందరికీ కమ్యూనికేట్ చేయాలి. అబ్బో అంటున్నాడు. అది మన స్టార్స్..సెల్ ఫోన్ బంధాలు.


Click it and Unblock the Notifications











