కొత్త సినిమాలు - సెంటిమెంట్లు

By Staff

తెలుగు సినిమా అంటే ఉగాది పచ్చడిలా షడ్రుచులూ ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. నిర్మాతలూ, దర్శకులూ సాధ్యమైనంత వరకూ ఆ ఫార్ములాతోనే కథను వండేందుకు ప్రయత్నిస్తారు. ఉద్వేగాలు, హాస్యం, ఫైట్లు, మంచి సంగీతం, డాన్సులు, కొంచెం శృంగారం, చివరిదైనా చాలా ముఖ్యమైనది సెంటిమెంటు. ఇవన్నీ బలంగా ఉంటే సినిమా హిట్టే అని నిర్మాతలు భావిస్తుంటారు.

మనిషికి చాలా సెంటిమెంట్లు ఉన్నా సినిమా వాళ్లు మాత్రం కేవలం నాలుగైది సెంటిమెంట్లు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు.. ఇలా చాలా దగ్గరి వాళ్ల గురించి సెంటిమెంట్‌ సీన్లు తెలుగు సిన్మాలో ఉండాల్సిందే. అందులో మదర్‌ సెంటిమెంట్‌ గానీ, సిస్టర్‌ సెంటిమెంట్‌ గానీ మరీ ముఖ్యమైనవి. మన హీరోలకి మహిళా ఫ్యాన్స్‌ చాలా అవసరం కాబట్టి.

త్వరలో తెలుగులో వస్తున్న రెండు స్ట్రయిట్‌ చిత్రాలు సిస్టర్‌ సెంటిమెంట్‌నే నమ్ముకున్నాయి. పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న అన్నవరం చిత్రం కథలో ఒక అన్నయ్య చెల్లెలుకు కలిగిన యిబ్బందిని తొలగించి - నా చెల్లెలకే కాదు, ఈ వూరిలో మరే చెల్లికీ ఇలాంటి దుర్మార్గుడి వల్ల అవస్థలు కలుగకూడదు అని ప్రకటించడం ప్రధాన ఇతివృత్తం. నిజానికి సినిమాలో హీరో పేరు అన్నవరం కాకపోయినా ఒక చెల్లాయికి అన్న ఇచ్చే వరం కాబట్టి దీనికి అన్నవరం అని పేరు పెట్టారని తెలుస్తోంది. చాలాకాలం తర్వాత ఆసిన్‌ ఈ తెలుగు చిత్రంలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే, కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న రాఖీ సినిమా కూడా చెల్లెలు సెంటిమెంట్‌తోనే ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు పెద్ద కాస్టింగ్‌తో, మంచి సంస్థలు రూపొందిస్తున్న చిత్రాలు కాబట్టి రెండు చిత్రాల్లోనూ సెంటిమెంట్లు పండితే.. మహిళా ప్రేక్షకులకు అంతకన్నా కావలసింది ఏముంటుంది?

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X