కరోనా కల్లోలం..అయినా వెనక్కి తగ్గమంటున్న టాలీవుడ్ హీరోలు..షూట్స్ లో బిజీబిజీగా ఎవరెవరంటే?

దేశం మొత్తం కరోనా కలకలం సృష్టిస్తోంది. మొదటి దశ కంటే రెండో దశలో కేసులు వేగంగా పెరిగి పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లు యాంటీవైరల్ డ్రగ్స్ కోసం పెద్ద ఎత్తున కొరత కూడా వేధిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కొన్ని పెద్ద సినిమాలు కూడా షూటింగ్ నిలిపి వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంత కరోనా కలకలం సృష్టిస్తున్నా సరే తెలుగులో కొన్ని సినిమా షూటింగ్స్ మాత్రం ఇంకా ఆగలేదు. సైలెంట్ గా వారు షూటింగ్ చేసేసుకుంటున్నారు.

ప్రస్తుతానికి ఈ అంశం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి దాదాపు ఆరు పెద్ద సినిమాల షూటింగ్ జరుగుతున్నాయి. అయిదు సినిమాలు ఏమిటి అనేది ఒక సారి పరిశీలిస్తే

అఖండ

అఖండ

నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా సరే ఈ సినిమా షూటింగ్ కు మాత్రం బ్రేకులు పడకుండా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ బ్రహ్మాండమైన స్పందన తెచ్చుకుంటూ రికార్డులు బద్దలు కొట్టే దిశగా పయనిస్తోంది. లెక్క ప్రకారం ఈ సినిమా మే నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అప్పటికి థియేటర్ లో ఓపెన్ చేస్తే సినిమా రిలీజ్ చేసేందుకుగాను సినిమా షూటింగ్ వాయిదా వేయకుండా చేస్తున్నట్లు చెబుతున్నారు.

పుష్ప

పుష్ప

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ జరుగుతోంది. పబ్లిక్ కి ఎలాంటి సంబంధం లేని ప్రదేశంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కి కూడా ఇబ్బందులు లేవని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ రష్మిక మందన, స్పెషల్ పాత్రలో నటిస్తున్న అనసూయ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది

శ్యామ్ సింగరాయ్

శ్యామ్ సింగరాయ్

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పబ్లిక్ ఎలాంటి సంబంధం లేని ప్రదేశంలో జరుగుతోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ కూడా నిరాటంకంగా జరుగుతోంది. ఈ సినిమా కోసమే నిర్మించిన ప్రత్యేక గుడి సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు..

మహా సముద్రం

మహా సముద్రం

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమా ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ నలుగురు కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. ముందు చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 19న ఈ సినిమాను రిలీజ్ చేయాలని షూటింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

అంటే సుందరానికీ

అంటే సుందరానికీ

టైటిల్ తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ శివార్లలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. హీరో నాని ఒకపక్క శ్యాం సింగరాయ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నజ్రియా నజీమ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

థాంక్యూ

థాంక్యూ


నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవితో లవ్ స్టోరీ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు చైతన్య. అయితే కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా సరే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ ను ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది అయితే ఆ విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X