చిరంజీవి, వేటూరి, ముళ్ళపూడి కాంబినేషన్
హిందీలో సూపర్ హిట్ అయిన హనుమాన్ యానిమేషన్ చిత్రం తెలుగు వెర్షన్ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాకు హీరో చిరంజీవి డబ్బింగ్ చెప్పడంతో పెద్ద పేరు వచ్చింది. పైగా పాటలను వేటూరి సుందరరామ్మూర్తి, మాటలను ముళ్ళపూడి వెంకట రమణ రాయడంతో క్రేజ్ ఇంకా పెరిగింది. ఈ సినిమాను హైదరాబాద్ ఇన్నొవేషన్ కంపెనీ అధినేత చల్లా కృష్ణమోహన్ నిర్మించారు. ఈ సినిమాకు భారతదేశపు ఉత్తమ యానిమేషన్ చిత్రంగా అంతర్జాతీయ అవార్డు వచ్చింది. ఈ సినిమాకు తపన్ రాలియా సంగీతం సమకూర్చారు. విజీ సామంత్ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications