టీడీపీలోకే భూమిక?

దీంతో ఆమె టీడీపీలో చేరే అవకాశం ఉందని బలంగా వినిపిస్తోంది. దాంతో నందమూరి హీరోలు తప్ప ఇంత వరకు పెద్దస్టార్లు లేని టీడీపీలోకి చేరటం ఆనందాన్నే కలుగుచేస్తోంది. అయితే తెలుగు సరిగా రాని ఆమె ప్రచారానికి వెళ్తుందా అనేదే సందేహమే అంటున్నారు. భూమిక ప్రస్తుతం రాజశేఖర్ సరసన నా రూటే సెపరేట్ అనే చిత్రంలో నటిస్తోంది. మళయాళ సూపర్ హిట్ హలో చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని రామ్ ప్రసాద్ డైరక్ట్ చేస్తున్నారు. అలాగే నవదీప్ సరసన యోగం అనే చిత్రంలో నటిస్తూ నిర్మిస్తోంది. తమ్ముడు ఫేమ్ అరుణ్ ప్రసాద్ డైరక్షన్ లో వస్తున్న ఈ చిత్రం రిలీజుకు రెడీగా ఉంది. ఇక తన డౌన్ టౌన్ ఎంటర్టైన్ మెంట్స్ పై ఆమె సత్యభామ దర్శకుడు శ్రీహరి నాను తో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











