twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పబ్‌లో హీరో మంచు మనోజ్ వీరంగం, స్వల్ప విధ్వంసం...!

    By Bojja Kumar
    |

    తెలుగు హీరో మంచు మనోజ్ గురించిన ఓ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో నిర్వాహకులతో మనోజ్ గొడవ పడ్డారని, ఈ క్రమంలో స్వల్ప విధ్వంసం చోటు చేసుకుందని సమాచారం. అయితే ఈ ఘటనపై పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీంతో పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయకుండా జనరల్ డైరీలో వివరాలు నమోదు చేసుకున్నారు.

    గొడవ ఎందుకు జరిగింది?

    గొడవ ఎందుకు జరిగింది?

    మే 22న జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45లో ఉన్న ఫ్యాట్ పీజియన్ పబ్‌కు మనోజ్ వెళ్లారు. పబ్ క్లోజింగ్ సమయం కావడంతో రాత్రి 11.30 గంటలకు నిర్వాహకులు డీజే సౌండ్ తగ్గించారు. అయితే సౌండ్ పెంచాని మనోజ్ నిర్వాహకులతో గొడవ పడ్డాడని, ఈ క్రమంలో స్పీకర్లు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

    పోలీసులకు మనోజ్ వివరణ

    పోలీసులకు మనోజ్ వివరణ

    ఈ గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే పబ్ వద్దకు చేరుకున్నారు, అక్కడే ఉన్న మనోజ్‌ను ప్రశ్నించారు. తాను ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేశానని, సౌండ్ ఎక్కువగా ఉండడంతో తగ్గించమని మాత్రమే చెప్పానని మనోజ్ వారికి చెప్పినట్లు సమాచారం.

    ఎవరూ ఫిర్యాదు చేయని వైనం

    ఎవరూ ఫిర్యాదు చేయని వైనం

    మనోజ్‌పై ఫిర్యాదు చేసేందుకు పబ్ నిర్వాహకులు ముందుకు రాలేదు. ఇతర వ్యక్తులు కూడా మనోజ్ మీద ఫిర్యాదు చేయక పోవడంతో జనరల్ డైరీ (జీడీ)లో ఈ ఘటన గురించిన వివరాలు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

    వీడియో పుటేజ్ సేకరించిన పోలీసులు

    వీడియో పుటేజ్ సేకరించిన పోలీసులు

    గొడవ ఎందుకు జరిగింది? ఎలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు పబ్ లోని సీసీటీవీ పుటేజీని సేకరించారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప మనోజ్ మీద కేసు నమోదు అయ్యే అవకాశం లేదని పోలీసులు చెబుతున్న మాట.

    English summary
    Telugu actor Manoj has created ruckus in Fat Pegion Hop bar, Banjara hills along with his friends. Reports suggest that he has damaged the music system.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X