»   » గమనించారా?: మన హీరోలు ట్రెండ్ మార్చారు(ఫొటో పీచర్)

గమనించారా?: మన హీరోలు ట్రెండ్ మార్చారు(ఫొటో పీచర్)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : ఇన్నాళ్లూ ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తూవస్తున్న మన హీరోలు ఇప్పుడు ట్రెండ్‌ మారుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, నాగచైతన్య, ... ఇలా స్టార్‌ హీరోలందరూ చేతిలో ఒక్కో సినిమా ఉన్నా, మరోవైపు తర్వాత సినిమా ఏంటనే విషయంపై దృష్టి సారిస్తున్నారు. అందువల్ల వీరి నుంచి ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  ''ఏడాదికి కనీసం రెండు, మూడు సినిమాలైనా చేస్తాం..''- గత కొన్నేళ్లుగా మన స్టార్‌ హీరోలు చెప్తున్న మాట ఇది. ఆచరణలో ఇది సాధ్యమవుతోందా అంటే లేదనే చెప్పాలి. గత నాలుగేళ్లలో చూస్తే మన యువ స్టార్‌ హీరోలు ఏడాదికి ఒక సినిమానే చేస్తూ వచ్చారు. ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమా అంగీకరించడానికీ సిద్ధంగా ఉండేవారు కాదు.

  ఇప్పుడా పరిస్థితి మారినట్లుంది. యువ హీరోలు ఒక్కొక్కరు జోరును పెంచుతున్నారు. ఒక సినిమా సెట్‌ మీద ఉండగానే మరో సినిమా అంగీకరించేస్తున్నారు. దీంతోపాటు కొత్త కథలూ వింటున్నారు. దీంతో మన పరిశ్రమలో కొత్త కళ ఆవరించింది. అదేంటో.. ఎవరు ఏ సినిమాలు అంగీకరిస్తున్నారో ఓ సారి చూద్దాం.

  పవన్‌ కల్యాణ్‌

  పవన్‌ కల్యాణ్‌

  పవన్‌ కల్యాణ్‌ సినిమాలు రెండూ ఒకేసారి సెట్స్‌పై ఉండటం చూసి ఎన్నాళ్త్లెంది?... ఇప్పుడు ఆలాంటి పరిస్థితి కనిపిస్తోంది. 'గోపాల గోపాల', 'గబ్బర్‌సింగ్‌2' ఒకేసారి చిత్రీకరణ జరుపుకోబోతున్నాయి. ఇప్పటికే 'గోపాల గోపాల' చిత్రీకరణ ప్రారంభమవ్వగా.. 'గబ్బర్‌సింగ్‌2' త్వరలో పట్టాలెక్కుతుంది. ఈ రెండూ స్వల్ప వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

  మహేష్‌

  మహేష్‌


  గత నాలుగేళ్లలో మహేష్‌ సినిమాల జాబితా చూస్తే ఏడాదికొక్కటే. ఇప్పుడు మహేష్‌ వరుస సినిమాలు అంగీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. 'ఆగడు' సెట్స్‌ మీద ఉంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశాడు. అది త్వరలో ప్రారంభమవుతుంది. దీని తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా ఉంటుందని మహేష్‌ ఇటీవల చెప్పాడు.

  ఎన్టీఆర్‌

  ఎన్టీఆర్‌

  యువ స్టార్లలో ఏడాదికి రెండు సినిమాలు చేసేవారిలో ఎన్టీఆర్‌ని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. నాలుగేళ్లుగా ఆయన ఇలానే చేస్తూ వచ్చాడు. దీన్ని కొనసాగిస్తూ ఇప్పుడు 'రభస' తర్వాత కూడా మరో రెండు ప్రాజెక్టులు ఓకే చేశాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో (ఈ సినిమాకు 'రుబాబు' అనే పేరు పరిశీలనలో ఉంది) ఓ సినిమా త్వరలో ప్రారంభమవుతుంది. మరోవైపు వక్కంతం వంశీ సినిమా కూడా త్వరలో పట్టాలెక్కబోతోంది. దీంతో పాటు నాగార్జునతో కలసి మల్టీస్టారర్‌ సినిమా కూడా అంగీకరించాడు ఎన్టీఆర్‌. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారు.

  రామ్‌చరణ్‌

  రామ్‌చరణ్‌

  ఈ ఏడాది ప్రారంభంలో 'ఎవడు' అంటూ అందరినీ పలకరించిన రామ్‌చరణ్‌ ఇప్పుడు 'గోవిందుడు అందరివాడేలే' అనిపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా చివరి దశకు రాకముందే ఆయన తర్వాత సినిమాలేంటి అనే విషయమై ఓ స్పష్టత వచ్చేసింది. శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాలు చేస్తాడని తెలుస్తోంది.

  అల్లు అర్జున్

  అల్లు అర్జున్


  'రేసుగుర్రం'గా పరిశ్రమలో వసూళ్ల పరుగు చేశాడు అల్లు అర్జున్‌. ఈ సినిమా విడుదలకు ముందే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించాడు. త్వరలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఇప్పుడు 'రుద్రమదేవి'లో గోనగన్నారెడ్డిగా అవతారమెత్తాడు. దీని తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో సినిమా చేయడానికి అల్లువారి కుర్రాడు అంగీకరించాడట.

  నాగచైతన్య

  నాగచైతన్య

  'తడాఖా', 'మనం' విజయాల తర్వాత నాగచైతన్య కూడా జోరు పెంచాడు. ఇప్పుడు 'ఒకలైలా కోసం' చివరి దశకొచ్చింది. ఇటీవల సుధీర్‌వర్మ దర్శకత్వంలో చేయబోయే సినిమా ప్రారంభమైంది. దీని తర్వాత సినిమా ఏంటనేది త్వరలో ప్రకటిస్తారు. కథా చర్చలు చివరి దశకు వచ్చాయని సమాచారం.

  వెంకటేష్

  వెంకటేష్

  సినిమా తప్ప మరో వ్యాపకం లేని కథానాయకుడు వెంకటేష్‌. సమయం దొరికితే కుటుంబానికి కేటాయిస్తుంటారు. ఇంకా సమయం దొరికితే ఆధ్యాత్మికత విషయాలవైపు దృష్టిసారిస్తుంటారు. ఇప్పుడు మాత్రం ఆయన చూపు విజయంవైపే ఉంది. 'దృశ్యం', 'ఓ మై గాడ్‌' రీమేక్‌ సినిమాలు తప్పకుండా ఫలితాల్ని తీసుకొస్తాయని నమ్ముతున్నారు. 'దృశ్యం' రేపు విడుదల అవుతోంది.

  సునీల్

  సునీల్

  జోరుమీదున్నారు సునీల్‌. ఒకదాని వెంట మరో కథని ఎంపిక చేసుకొంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా వాసు వర్మ దర్శకత్వంలో చిత్రం కమిటయ్యారు. త్వరలో 'భక్తకన్నప్ప' కోసం సెట్స్‌పైకి వెళ్లబోతున్నారు. ఆ తర్వాత గోపీమోహన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. వీటితోపాటు రచయిత విక్రమ్‌సిరి చెప్పిన కథ సునీల్‌కి బాగా నచ్చిందట. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని నిర్ణయించుకొన్నారు.

  అల్లరి నరేష్

  అల్లరి నరేష్

  రీసెంట్ గా జంపు జిలానీ తో ప్లాపు కొట్టిన అల్లరి నరేష్...ఇప్పుడు వరసగా సినిమాలు కమిటవుతున్నారు. బందిపోటు చిత్రం చేస్తున్న ఆయన అదే సమయంలో నాటు బాంబు చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు.

  English summary
  Tollywood Hero's change their trend. All they working busy shedules. Telugu cinema screens are going to come alive with a variety of films, and movie aficionados can brace themselves for full-on entertainment, Tollywood ishtyle!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more