ప్రస్తుతం బోణి చిత్రంలో చేస్తున్న సుమంత్ ఓ సారి తాను అనుకోకుండా లేడిస్ బాత్రూమ్ లో దూరాడు. అయితే అది సెల్ లో మాట్లాడుతూ పరిశరాలును సరిగా గమనించకపోవటం వల్ల జరిగిన పొరపాటు. అయితే అప్పటికే అందులో ఓ అమ్మాయి ఉంది. ఆమె సుమంత్ ని చూసి అపార్ధం చేసుకుని అల్లరి చేసింది. తాను పొరపాటునే ఇలా చేయవలిసి వచ్చిందన్నా ఆమె పట్టించుకోకుండా దులిపేసింది. అయితే ఆమెను, ఆమె కోపాన్ని అర్ధం చేసుకోగలను అంటున్నాడు సుమంత్. తను చేసిన తప్పు అది అని సెల్ లో మాట్లాడేటప్పుడు కాస్తా చుట్టుప్రక్కల పట్టించుకోవాలని లేకపోతే ఇలాంటి అనర్దాలే జరుగుతాయని, అలాగే సెల్ లో మాట్లాడుతూ రోడ్డు దాటటం వంటివి చేయకూడదని, అప్పుడు తప్పుని సరిదిద్దుకోవటానికి అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నాడు. సెల్ తో ఎలా మెలగాలో చెప్తూ సుమంత్ తన స్వీయ అనుభవాలను ఇలా చెప్పుకొచ్చాడు.