Pawan Kalyan పిఠాపురంలో వరుణ్ తేజ్‌కు ఘన స్వాగతం.. మెగాస్టార్ చిరంజీవి ప్రచారం ఎప్పుడంటే?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంపై దేశవ్యాప్తంగా దృష్టిసారించింది. ఈ నియోజకవర్గం దేశంలోనే అత్యంత ఆసక్తిని కనబరుస్తున్న అసెంబ్లీ స్థానంగా రికార్డును క్రియేట్ చేస్తున్నది. పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పవన్ పోటీ చేస్తున్న నేపథ్యంలో సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా వరుణ్ తేజ్ ప్రచారంలోకి అడుగుపెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్ అభిమానులైన జబర్దస్త్ బ్యాచ్, అలాగే గబ్బర సింగ్ బ్యాచ్ పిఠాపురంలో భారీగా ప్రచారం నిర్వహించారు. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ తదితరులు ప్రచారం చేసి వచ్చారు. ఇక గబ్బర్ సింగ్ టీమ్ గడపగడపకు వెళ్లి పవన్ కల్యాణ్‌కు ఓటు వేయాలని కోరుతున్నారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు.

Telugu Hero Varun Tej gets grand Welcome at Pawan Kalyan s Pithapuram Constency

ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం నిమిత్తం కొణిదెల వరుణ్ తేజ్ శనివారం రాజమండ్రికి చేరుకొన్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. చిరంజీవి యువత అభిమాన సంఘాల నాయకులు శ్రీ ధర్మేంద్ర, శ్రీ బాబీ ఏడిద నేతృత్వంలో అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు.

వరుణ్ తేజ్ తన ప్రచార పర్యటనలో భాగంగా గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం మొదలు పెట్టి వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకుంటారు. ఎన్నికల ప్రచార ర్యాలీ, రోడ్ షో, సమావేశాల్లో పాల్గొని ప్రసంగిస్తారు అని బాబీ, ధర్మేంద్ర తెలిపారు.

Telugu Hero Varun Tej gets grand Welcome at Pawan Kalyan s Pithapuram Constency

ఇదిలా ఉండగా, పిఠాపురంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రచారం చేస్తారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే ప్రస్తుతానికి ఈ వార్త రూమర్‌గానే చూడాలని అంటున్నారు. అయితే చిరంజీవి పిఠాపురంలో పవన్‌కు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా నైతిక మద్దతు ఇచ్చారు. కానీ చిరంజీవి ప్రచారం చేస్తారా అనేది సందేహంగానే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X