శ్వేతా బసు ఇపుడు ఎక్కడ? తెలుగు హీరో హెల్ప్
హైదరాబాద్: తెలుగు హీరోయిన్ శ్వేతా బసు గత కొన్ని రోజుల క్రితం వ్యభిచారం కేసులో అరెస్టయి రెస్క్యూ హోంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కోర్టు ఆదేశాల మేరకు ఆమెను విడుదల చేసారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్వేతా బసు ప్రస్తుతం తన స్వస్థలమైన ముంబై వెళ్లినట్లు సమాచారం.
శ్వేతా బసు రెస్క్యూ హోంలో ఉన్నపుడు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఆమెకు మద్దతు ప్రకటించారు. వారిలో తెలుగు హీరో మంచు విష్ణు కూడా ఒకరు. ఆమె ప్రజ్వల్ రెస్క్యూ హోంలో ఉన్నపుడు ఆయన స్వయంగా వెళ్లి శ్వేతా బసును కలిసారు. ఈ విషయాన్ని ప్రజ్వల్ రెస్క్యూ హోం ఇంచార్జ్ సునీతా కృష్ణన్ వెల్లడించారు. శ్వేతా బసు సినిమాల్లో నటించడానికి ఎప్పుడు సిద్ధమైనా అవకాశాలు ఇవ్వడానికి తాను సిద్ధమని ఆయన భరోసా ఇచ్చినట్లు తెలిపారు.

కాగా ఇంతకాలం రెస్య్కూ హోంలో ఉన్న శ్వేతా బసు అక్కడి పిల్లలకు ఇంగ్లీష్ నేర్పడానికి తోడ్పడిందట. శ్వేతా బసు ఇపుడు చాలా మారిపోయిందని, ఇకపై ఆమె బాధ పడే విధంగా ఎవరూ ప్రవర్తించకూడదని, ఆమెపై జాలి చూపించడం గానీ, కోపం ప్రదర్శించడం గానీ చేయొద్దని సునీత కృష్ణన్ రిక్వెస్ట్ చేసారు.
బాలీవుడ్ మూవీ ‘మక్దీ' చిత్రం ద్వారా బాలనటిగా తెరంగ్రేటం చేసిన శ్వేతా బసు ప్రసాద్ కొత్తబంగారు లోకం చిత్రం ద్వారా టాలీవుడ్లో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత ఆమె పలు తెలుగు చిత్రాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











