Just In
- 48 min ago
అభిమాని పెళ్లిలో సడన్‌గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
- 1 hr ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
- 1 hr ago
బిగ్ బాస్ 5 మొదలయ్యేది ఎప్పుడంటే.. మరోసారి సోహెల్ కూడా..
- 2 hrs ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
Don't Miss!
- Sports
షకీబుల్ అరుదైన రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్లో ఏకైక ప్లేయర్‌గా!!
- News
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: ఆ 3 జిల్లాల్లో ‘సున్నా’, యాక్టివ్ కేసుల్లో క్షీణత
- Finance
ఈఎస్ఐ పథకంలో చేరిన 9.33 లక్షల మంది.. డేటా రిలీజ్
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎవరి స్థాయి ఎంత? బౌండరీ దాటేసిన మన తెలుగు హీరోలు
హైదరాబాద్: ఒకప్పుడు తెలుగు సినిమా అంటే తెలుగు రాష్ట్రాల బార్డర్ లోపల మాత్రమే ఆడేవి. అయితే రాను రాను పరిస్థితి మారింది. తెలుగు సినిమా మార్కెట్ ఇతర భాషా రాష్ట్రాల్లోనూ పెరగడం మొదలు పెట్టింది. పలువురు స్టార్ హీరోల సినిమాల మార్కెట్ పొరుగు రాష్ట్రాల్లో కోట్లు కొల్లగొట్టే స్థాయికి చేరింది కూడా.
మొదట్లో మన హీరోలు ఇతర భాషా మార్కెట్లపై పెద్దగా ఫోకస్ పెట్టేవారు కాదు. అయితే ఇతర భాషల హీరోలు తెలుగు మార్కెట్లో పాగా వేస్తుండటం, మంచి లాభాలు గడిస్తుండటంతో....తెలుగు హీరోల ఫోకస్ కూడా ఇతర భాషా చిత్రాలపై పడింది. క్రమక్రమంగా మన హీరోలు కూడా ఇతర భాషా మార్కెట్లలో తమ సత్తాచాటడం మొదలు పెట్టారు.
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు పొరుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ కలిగి ఉన్నారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. బాహుబలి 2 సినిమా తర్వాత కూడా ప్రభాస్ సినిమాలు బాలీవుడ్లోనూ విడుదలవుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక మలయాళం మార్కోట్లో బన్నీ ఇప్పటికే పాగా వేసాడు. అల్లు అర్జున్ సినిమాలకు నైజాం, ఆంధ్ర, సీడెడ్, ఓవర్సీస్ తర్వాత ప్రధాన మార్కెట్ గా మలయాళం మార్కెట్ ఉంది. ఇక జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ కూడా మలయాళం ఎంట్రీ ఇస్తున్నారు. మరికొందరు హీరోలు కూడా ఇతర బాషాల్లో తమ మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
మహేష్ బాబు సినిమాలకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటనకలో మంచి మార్కెట్ ఉంది. మురుగదాస్ సినిమా ద్వారా తమిళంతో పాటు హిందీలో కూడా తమ మార్కెట్ ను విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

బాహుబలి
ఇకపై ప్రభాస్ సినిమా కెరీర్ గురించి చెప్పుకోవాలంటే బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుందేమో. అప్పటి వరకు తెలుగుకే పరిమితం అయినా ప్రభాస్ ఈ సినిమాతో నేషనల్ స్టార్ అయ్యాడు.

అల్లు అర్జున్
అల్లు అర్జున్ సినిమాలకు తెలుగుతో పాటు మలయాళంలో మంచి మార్కెట్ ఉండటంతో అతన్ని మల్లు అర్జున్ అని పిలుస్తున్నారు. కర్నాటకలో కూడా బన్నీ సినిమాలు బాగానే ఆడుతున్నాయి.

మహేష్ బాబు
మహేష్ బాబు సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడలో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయనకు నేషనల్ వైడ్ గా గుర్తింపు ఉన్నా....హిందీలో మాత్రం మార్కెట్ లేదు. ఉత్తరాది వారికి బాగా తెలిసిన తెలుగు హీరోల్లో మహేష్ బాబు ఒకరు. దీన్ని బేస్ చేసుకుని త్వరలో మురగదాస్ సినిమా ద్వారా హిందీ, తమిళంలో కూడా తన మార్కెట్ పెంచుకోబోతున్నారు.

రానా
రానా హిందీ, తమిళ ప్రేక్షకులకు పరిచయమే. తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లో కూడా రానా అవకాశాలు దక్కించుకుంటున్నారు.

నాని
ఈగ సినిమాతో నాని బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. తమిళంలో కూడా నానికి మంచి గుర్తింపు ఉంది.

రామ్ చరణ్
జంజీర్ చిత్రం ద్వారా రామ్ చరణ్ హిందీ ప్రేక్షకులకు పరిచయమే. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడులో కూడా రామ్ చరణ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది.