12 రోజులు పడుకుంటే ఫ్లాట్ గిఫ్ట్.. ఆ పని చేస్తే కారు: తెలుగు హీరోయిన్‌తో ఆసభ్య ప్రవర్తన
సాధారణంగా నార్త్ హీరోయిన్లు మాత్రమే ఎంతో బోల్డుగా ఉంటారు. కానీ, ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది భామలు కూడా తెగించేస్తున్నారు. అలా డిఫరెంట్ నేమ్ తెచ్చుకున్న వారిలో గాయత్రి గుప్తా ఒకరు. అచ్చ తెలుగు అమ్మాయి అయిన ఈ భామ.. టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడి సెన్సేషన్ అయింది. అప్పటి నుంచి వరుసగా ఇంటర్వ్యూల్లో బోల్డుగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా.. బాలీవుడ్ కాస్టింగ్ కౌచ్‌పై కామెంట్స్ చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసమే!
గాయత్రి అలా పాపులర్
గాయత్రి గుప్తా ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. అలా ఆరంభంలో యాంకర్‌గా చేసి బాగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ముఖ్యంగా గాయత్రి 'ఫిదా', 'ఐస్‌క్రీమ్ 2', 'కొబ్బరిమట్ట', 'మిఠాయి' సహా ఎన్నో సినిమాలతో పాటు 'పెళ్లికి ముందు', 'సీత ఆన్ ద రోడ్' అనే షార్ట్ ఫిల్మ్‌లలోనూ నటించి అలరించింది.

ఎక్కువగా అలాంటివే
తెలుగు అమ్మాయి గాయత్రి గుప్తా ఇటీవలి కాలంలో పెద్దగా ఆఫర్లను దక్కించుకోవడం లేదు. కానీ, దొరికిన వచ్చిన ప్రతి ఆఫర్‌ను కూడా సద్వినియోగం చేసుకుంటోంది. ఇలా ఈ మధ్య కాలంలో 'అన్‌స్టాపబుల్', 'ప్లాట్', 'డబుల్ ఇంజిన్' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే, గత ఏడాది వచ్చిన 'దయా' వెబ్ సిరీస్‌లో అద్భుతమైన పాత్రతో హైలైట్ అయింది.
కాస్టింగ్ కౌచ్‌తో ఫేమస్
కాస్టింగ్ కౌచ్ అనే అంశం తెలుగు సినిమా రంగంలో ప్రకంపణలు సృష్టించిన విషయం తెలిసిందే. దీన్ని వెలుగులోకి తీసుకు వచ్చిన మొదటి సెలెబ్రిటీ గాయత్రి గుప్తానే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిపై ఆమె చాలా కాలం పాటు పోరాటం కూడా చేసింది. ఇలా చాలా కాలం పాటు గాయత్రి గుప్తా సంచలనం అయింది. ఆమె తర్వాతనే శ్రీరెడ్డి ఈ పోరాటం కంటిన్యూ చేసింది.

పోరాటం చేసి రిజెక్టు
గాయత్రి గుప్తా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని కూడా ప్రయత్నాలు చేసింది. మరీ ముఖ్యంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గరకు వెళ్లి మరీ బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాలని పోరాటం చేసింది. దీంతో గాయత్రి దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే ఆమెకు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ఆఫర్ వచ్చిందట. కానీ, దీన్ని ఆమె రిజెక్ట్ చేసినట్లు తెలిసింది.
బాలీవుడ్‌లో అవకాశం
గాయత్రి గుప్తా తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె బాలీవుడ్‌లో సైతం కాస్టింగ్ కౌచ్ గురించి బయటపెట్టేసింది. 'నేను తెలుగులో చాలా సినిమాలు చేశాను. అయితే, అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. దీంతో ఇక్కడ ఆఫర్లు తగ్గిపోయాయి. అప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు బాలీవుడ్ ఆఫర్ వచ్చింది' అని వెల్లడించింది.

12 రోజులు పడుకుంటే
గాయత్రి గుప్తా ఇదే ఇంటర్వ్యూలో కంటిన్యూ చేస్తూ.. 'బాలీవుడ్‌లో ఆఫర్ ఇస్తామని కొందరు నాతో అసభ్యంగా ప్రవర్తించారు. అప్పుడు నన్ను 12 రోజులు వాళ్లతో పడుకోవాలని అడిగారు. అలా చేస్తే ఓ ఫ్లాట్, కారుతో పాటు పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు. దీంతో నేను ఎవరికీ చెప్పుకోలేక అక్కడి నుంచి వచ్చేశాను. ఇలా కాస్టింగ్ కౌచ్ అంతటా ఉంది' అని వివరించింది.


Click it and Unblock the Notifications











