పవన్‌తో ఆరోజు స్పెషల్‌గా ప్లాన్ చేస్తా.. హీరోయిన్ మాధవి లత షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలు అంతగా కనిపించడం లేదు. అప్పట్లో ఎక్కువగా ఇక్కడి వాళ్లనే తీసుకున్న ఫిల్మ్ మేకర్లు.. కొన్నేళ్లుగా పొరుగు రాష్ట్రాల హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో అందం, టాలెంట్ ఉన్న మన అమ్మాయిలు అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు. అలాంటి సమయంలో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంటర్ అయింది మాధవి లత. సినిమాల్లోకి ఎంటర్ అయినప్పటికీ.. వ్యక్తిగతంగానే ఆమె పాపులర్ అయింది. ఇప్పటికే ఎన్నో షాకింగ్ స్టేట్‌మెంట్లు ఇచ్చిన ఆమె.. తాజాగా ఎన్టీఆర్, పవన్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళ్తే...

అక్కడ పుట్టిన ఇక్కడి అమ్మాయి
మాధవి లత తెలుగు మూలాలున్న కుటుంబానికి చెందిన అమ్మాయి. బళ్లారిలో జన్మించిన ఆమె.. విద్యాభ్యాసం మొత్తం అక్కడే పూర్తి చేసింది. పుట్టినప్పటి నుంచి కర్నాటకలోనే ఎక్కువ భాగం గడిపినప్పటికీ.. తెలుగును అనర్గళంగా మాట్లాడుతుంది. అందుకే మొదట తెలుగు సినిమాలోనే అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు ఏపీలోనే సెటిల్ అయిపోయింది.

మహేశ్ సినిమాతో ఎంటర్ అయింది
రవిబాబు దర్శకత్వంలో తనీష్ హీరోగా నటించిన ‘నచ్చావులే' సినిమా ద్వారా మాధవి హీరోయిన్‌గా పరిచయం అయింది. అయితే, అంతకంటే ముందే ఆమె మహేశ్ బాబు నటించిన ‘అతిథి'లో ఓ పాత్రను పోషించింది. ‘నచ్చావులే'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. నాని సరసన ‘స్నేహితుడా'లో కూడా నటించింది. ఆ తర్వాత ‘అరవింద్ 2' మినహా ఏ సినిమా విడుదల కాలేదు.

సినిమాలు లేకున్నా అక్కడ ఫుల్ బిజీ
2015లో తమిళంలో వచ్చిన ‘అంబాల' తర్వాత మాధవి లత సినిమాల్లో నటించలేదు. అయినప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో అంశాలను పంచుకుంటోంది. అలాగే, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.

రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎన్నికల్లో పోటీ
మాధవి లత గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ జాతీయ పార్టీలో చేరింది. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ఆమె చెప్పుకొచ్చింది. గత ఎన్నికల్లో అదే పార్టీ తరపున పోటీ కూడా చేసింది. సొంత జిల్లా నుంచే బరిలోకి దిగినప్పటికీ మాధవి లత ఘోరంగా ఓడిపోయింది. ఫలితంగా డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.

జూనియర్ ఎన్టీఆర్ ఆఫర్ రిజెక్ట్ చేశా
సినిమాలకు దూరమైనప్పటికీ మాధవి లత తరచూ ఏదో ఒక విషయంతో ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నాకు ఎన్టీఆర్ నటించిన ‘రాఖీ'లో ఆయన చెల్లి పాత్ర ఆఫర్ వచ్చింది. స్టార్ హీరోతో చెల్లిగా చేయడం ఇష్టం లేక దాన్ని వదులుకున్నా' అని చెప్పుకొచ్చింది.
Recommended Video

పవన్‌తో ఆరోజు స్పెషల్‌గా ప్లాన్ చేస్తా
చాలా రోజులుగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తనకున్న ఇష్టాన్ని వ్యక్తపరుస్తోంది మాధవి. ఇక, ఈ ఇంటర్వ్యూలో ఆయన గురించి చెబుతూ.. ‘పవన్ మీద పదిహేనేళ్లుగా క్రష్ ఉంది. ఆయనను ఇప్పటి వరకు కలవలేదు. కలిసే రోజు వస్తే స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తా. ఆరోజు త్వరలోనే రావాలని కోరుకుంటున్నా' అని ఈ తెలుగమ్మాయి వివరించింది.


Click it and Unblock the Notifications











