»   » తెర మీద అవకాశాలు లేవు..కాల్ గర్ల్ గా చేస్తున్న తెలుగు హీరొయిన్

తెర మీద అవకాశాలు లేవు..కాల్ గర్ల్ గా చేస్తున్న తెలుగు హీరొయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటి గా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర అనగానే అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చేది అయితే హీరోయిన్ దెయ్యం గా కనిపించటం లేదంటే వేశ్య పాత్ర లో కనిపించటం. అయితే ఇప్పటివరకూ వసంత కోకిల ంలో శ్రీదేవి లాంటి పాత్రల తో నెగ్గుకు రావటం కూదా కష్టమే.... మిగిలిన రెండు పాత్రల్లో ఎంతో కొంత గ్లామర్ తో నెట్టుకు రావొచ్చు. అయితే మన వాళ్ళు ఎంచుకునే కాల్ గర్ల్స్ పాత్ర అంటే పేద అమ్మాయి నే తీసుకుంటారు కరుణ రసం కూడా పిండాలి కదా...

హిందీలో చమేలీ సినిమాలో కరీనా, తమిళ్ లో ధనుష్ హీరో గా వచ్చిన సినిమాలో స్నేహా, వేదం లో అనుష్కా వేశ్య పాత్రలతో బాగానే అదర గొట్టారు. మంచి పేరూ సంపాదించారు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో ఇంకో హీరోయిన్ కూడా చేరిపోయింది. కాక పోతే ఇది లఘు చిత్రం అదే షార్ట్ ఫిలిం... ఇమంతకీ ఎవరా హీరొయిన్ అంటే....

madhavi

"నచ్చావులే" సినిమాతో తెలుగువారిని పలుకరించిన తూనీగ ... హీరోయిన్ మాధవీలత. చాలానే ట్రై చేసినా ఇండస్ట్రీ లో నిలదొక్కుకోలేక పోయింది. దాదాపు పెద్ద తెర కి దూరం అయిపోయినట్టే అనుకుంటున్న తరుణం లో ఆమె చూపు షార్ట్ ఫిలింస్ మీద పడింది.త్వరలో రానున్న "ఆన్ మోనాస్ బర్త్ డే" అనే ఒక షార్ట్ ఫిలింలో ఆమె "కాల్ గర్ల్" పాత్ర పోషించనుంది.

నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం టీజర్ ను తాజాగా యూట్యూబ్ లో విడుదల చేశారు. అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్రదేశంలో నడుచుకుంటూ వస్తున్న మాధవీలతను ఇందులో చూపించారు. మరో సీన్ లో కారులో చిన్నారితో మాట్లాడుతూ ఆమె కనిపించారు. ఆమె, ఆమె ఏడేళ్ల కొడుకు ఇతివృత్తంగా ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కినట్టు చిత్రవర్గాలు తెలిపాయి.

మంచి కథాంశమే తో తెరకెక్కినట్టు కనిపిస్తున్న ఈ షార్ట్ ఫిలిం టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. "కాల్ గర్ల్" పాత్ర పోషించడం సవాల్ తో కూడుకున్నదని,అది ఎంతో మందికి డ్రీం రోల్ కూడా అని అందుకే తాను ఈ పాత్రకు ఒప్పుకున్నానని మాధవీలత తెలిపింది. నిజమే డ్రీం రోల్ అయినా కాకునా పెద్ద తెర మీద ఎవరూ గుర్తించనప్పుడు తనని తాను నిరూపించుకోవటానికైనా ఈ సినిమాలో నటించాల్సిందే కదా...

English summary
An Indian Telugu actress Madhavi Latha is now going to act in short films. Earlier she worked for few movies like Nachavule, Snehituda and Aravind 2. Madhavi Latha is featuring in a short film titled ” On Mona’s Birthday ” as a call girl.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu