రంభని ఆ ఒక్కటీ అడగొద్దు!

ఇక యమదొంగలో ఐటం సాంగ్ చూసిన చాలా మంది దర్శక,నిర్మాతలు అలాంటివి మళ్ళి మళ్ళీ తమ సినిమాల్లో చేయమంటున్నారు (మరెందుకు చెయ్యటం లేదో). అయినా మీరడిగినట్లే కొంతకాలానికి నాకు ఆపర్స్ తగ్గిపోతే అప్పుడు టీవీ మీడియా ఉండనే ఉంది. సీరియల్స్ లో చేస్తా. అయితే నాకు ఈ ఫీల్డ్ లో డిమాండ్ ఉన్నంత కాలం అటువైపు వెళ్ళను. సర్లే గానీ ఇంతకీ రిటైరయ్యేదెప్పుడూ అంటే దానికామె ఆ ఒక్కటీ అడగొద్దు అంది. దాంతో ఇన్నాళ్ళూ రంభ అందాలు మాత్రమే చూసి ఆనందించిన వారు ఇప్పుడు తెలివితేటలు చూసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇంతకీ ఆమె టీవీల్లోకి ఎప్పుడు అడుగుపెడ్తుందా అని ఎదురుచూడాల్సిన పనిలేదు. ఆల్రెడీ తమిళ్ లో ఓ డాన్స్ బేబి డాన్స్ తరహా పోగ్రాంకి యాంకర్ గా చేస్తోంది. కాబట్టి ఎక్కడన్నా కనపడితే ఆ ఒక్కటీ మాత్రం అడక్కండి నిజం మాత్రం రాదు.


Click it and Unblock the Notifications











