twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలగు స్టార్ హీరోలు-క్లోజ్ ప్రెండ్స్ (ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : అందరికీ స్నేహితులు ఉంటారు. అయితే స్టార్స్ కు ఎవరు ప్రెండ్స్ ఉంటారు. ఎవరితో బాగా క్లోజ్ గా ఉంటారనేది అందరికీ ఆసక్తే. ఈ రోజు స్నేహితుల దినోత్సవం. ఈ సందర్భంగా ...హీరోలు,హీరోయిన్స్ తమ ప్రెండ్స్ ని తలుచుకుంటూ మీడియాతో మాట్లాడారు. సినిమాలో ప్రెడ్షిప్ అంటే...బాపు-రమణలు గుర్తుకు వస్తారు.

    స్నేహం. హిట్టూ, ఫ్లాపు - కష్టం, నష్టం ఏదొచ్చినా ఓ స్నేహితుడిని గుర్తుచేసుకొంటుంటామని చెప్తున్నారు. షూటింగ్‌ లేదంటే కాల్షీట్లు తమ ప్రెండ్స్ కే కేటాయిస్తామని అంటున్నారు. తాను స్టార్స్ మి అయినా తమ స్నేహితులు తో గడపటం చాలా ఉత్సాహాన్ని ఇస్తుందని అంటున్నారు.

    సాదాసీదా రాజా బహదూర్... రజనీకాంత్‌కి; అల్లరి నరేష్‌కి ఖయ్యూమ్, రింకూ, చైతూ... ; దివ్య, కరిష్మ... కాజల్‌కి; రేవతి, యామినీ... లక్ష్మీ ప్రసన్నకు; ఇంకా... రామ్‌చరణ్-శర్వానంద్, నికిష-త్రిష-చార్మీ... ఒకరికొకరు... అలాంటి ఫ్రెండ్. ఇంకా మన హీరోలు తమ స్నేహితులు గురించి ఏమంటున్నారో..ఓ మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వూలో కొన్ని భాగాలు మీకోసం...

    చిన్నప్పటి స్నేహం

    చిన్నప్పటి స్నేహం

    ఎన్టీఆర్ మాట్లాడుతూ.... ''స్నేహం అనే మాటే చాలా గొప్పది. ఏ స్వార్థమూ లేని ఒకే ఒక్క బంధం. అమ్మానాన్నల్ని, తోబుట్టువుల్ని భగవంతుడే నిర్ణయిస్తాడు. కానీ మన స్నేహితుల్ని మనమే ఎంచుకోవాలి. ఒక్కసారి స్నేహం మొదలుపెడితే, ప్రాణం పోయేవరకూ ఆ చేయి విడిచిపెట్టకూడదు. స్నేహాల్‌, కార్తీక్‌, లవ్‌రాజ్‌ ముగ్గురూ నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌. ఎల్కేజీ నుంచే చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాళ్లం. స్నేహాల్‌ అమెరికాలో ఉంటున్నాడు. మిగిలిన ఇద్దరూ ఇక్కడే ఉంటున్నారు. నా సినిమాలు చూస్తారు. అది బాగుంది, ఇది బాలేదు అని నిర్మొహమాటంగా చెప్తారు. అందుకే వాళ్లంటే నాకు చాలా ఇష్టం''.

    మొదట మానాన్నే...

    మొదట మానాన్నే...



    రామ్ చరణ్ మాట్లాడుతూ... ''నాకున్న క్లోజ్ ప్రెండ్, ఆత్మీయ నేస్తం... డాడీనే. ఆయన తరవాతే ఎవరైనా. మేమిద్దరం మంచి స్నేహితుల్లా మసులుకొంటాం. డాడీ నాకు అంత స్వేచ్ఛ ఇచ్చారు. ఏ విషయమైనా ఆయనతో నిర్భయంగా మాట్లాడతా. నా సినిమాల విషయంలో ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటారో. 149 సినిమాలు చేశారు. ఏ సినిమాకీ పడని టెన్షన్‌ నా చిరుత సినిమాకి పడ్డారు. కథలు, పాత్రల విషయంలో ఆయన సలహాలు ఎప్పుడూ తీసుకొంటుంటా. చిన్నప్పుడు నాన్నతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడేమో రాజకీయాలు. ఫోన్‌లకూ దొరకడం లేదు. కానీ ఇంటి పట్టున ఉంటే.. మాతోనే. ఇక పరిశ్రమలో స్నేహితులంటారా..? అందరితోనూ బాగానే ఉంటా. రానా మంచి ఆత్మీయుడు. చిన్నప్పటి నుంచీ తెలుసు. ఇద్దరం కలుసుకొంటే సినిమాలు తప్ప.. అన్ని విషయాలూ మాట్లాడుకొంటాం''. అన్నారు.

    అప్పటినుంచే...

    అప్పటినుంచే...


    గోపీచంద్ మాట్లాడుతూ... ''ఇండస్ట్రీలో నాకు స్నేహితులు చాలా తక్కువ. ప్రభాస్‌తోనే ఎక్కువ ఆత్మీయంగా ఉంటాను. ఇద్దరం కలిసి 'వర్షం'లో నటించాం. ఎప్పుడు కలిసినా సరదాగా మాట్లాడుకొంటాం. మరో సినిమా చేద్దాం అనుకొంటున్నా.. కథ దొరకడం లేదు. ఇక చిన్నప్పటి స్నేహితులంటే... కుమార్‌, మురళి. రెండో తరగతి నుంచీ వీరిద్దరూ నాకు మంచి స్నేహితులు. ప్రతి రోజూ టచ్‌లో ఉండంగానీ, కలసినప్పుడు మాత్రం హంగామా చేస్తాం'' అన్నారు.

    వాడు చనిపోయాడు..

    వాడు చనిపోయాడు..

    అల్లరి నరేష్‌ మాట్లాడుతూ... ''అన్నీ అందరితో పంచుకోలేం. ఇంట్లో చెప్పుకోలేనివి స్నేహితులతో మాత్రమే పంచుకోగలం. ఏమీ చెప్పకపోయినా సరే, ఫోన్‌లో గొంతు విని 'ఏంట్రా.. ఏమైంది?' అని అడిగేది స్నేహితుడు మాత్రమే. ముద్దు కృష్ణ అనే ఫ్రెండ్‌ ఉండేవాడు. 2007లో చనిపోయాడు. నేను ఎవరినైనా మిస్‌ అయ్యానంటే డాడీనీ, ముద్దుకృష్ణలే. ఆ తరవాత ఖయ్యూమ్‌, రింకూ మంచి ఫ్రెండ్స్‌ అయ్యారు. ఇప్పుడు పరిశ్రమలో ఉన్న యంగ్‌ బ్యాచ్‌ అంతా నా దోస్తులే. బాబాయ్‌.. బాబాయ్‌ అని ప్రేమగా పలకరించుకొంటాం. ఆడియో వేడుక ఎవరిది జరిగినా హాజరైపోతాం. శర్వానంద్‌, వరుణ్‌ సందేశ్‌, ఉదయ్‌కిరణ్‌, నవదీప్‌, తనీష్‌ ఇలా అందరం ఓచోట కలిస్తే పండగే. సినిమాలు, అమ్మాయిలు తప్ప అన్ని విషయాలూ మాట్లాడుకొంటాం. శర్వాతో 'గమ్యం', 'నువ్వా నేనా' సినిమాలు చేశా. 'కెవ్వు కేక' ఆడియో వేడుక కోసం నాని కోయంబత్తూరు నుంచి వచ్చేశాడు. 'మొన్న మీ అన్నయ్య పెళ్లి చేశావ్‌ కదా? నా పెళ్లి పనులు కూడా చేసిపెట్టు' అని ఉదయ్‌కిరణ్‌ అడిగాడు. 'ఈసారి అందరం కలసి క్రికెట్‌ ఆడదాం' అని శ్రీకాంత్‌ అడుగుతుంటారు. తనీష్‌, శ్రీ, ప్రిన్స్‌ వీళ్లంతా మాకంటే చిన్నవాళ్లే. కానీ మా గ్యాంగ్‌లో కలిపేసుకొన్నాం. అందరూ కలసి ఓ క్రికెట్‌ మ్యాచ్‌ కూడా ఆడబోతున్నాం. ఆ డబ్బులు ఏదైనా మంచి పని కోసం ఉపయోగించాలని మా ఆలోచన''. అన్నారు.

    ‘హి ఈజ్ మిస్టర్ పర్‌ఫెక్ట్'

    ‘హి ఈజ్ మిస్టర్ పర్‌ఫెక్ట్'

    శర్వానంద్ మాట్లాడుతూ... నన్ను గాఢనిద్రలో లేపి మరీ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని అడిగినా కూడా నేను తడుముకోకుండా చెప్పే ఒకే పేరు... రామ్‌చరణ్. మా ఇద్దరిదీ సినిమా స్నేహం కాదు. మేమిద్దరం బాల్యమిత్రులం. ఒకే మంచం, ఒకే కంచం అన్నంత కాకపోయినా కొంచెం అటూఇటూగా అంతే. బేసిగ్గా నేను చాలా విషయాలు మర్చిపోతుంటాను. కానీ చరణ్ దోస్తీలోని మజాను మాత్రం ఎప్పటికీ మరిచిపోలేను. మేమిద్దరం కలిసి ఆడిన ఆటలు, చేసిన అల్లర్లు, వెళ్లిన ప్రదేశాలు, చూసిన సినిమాలు... అబ్బో చాలా ఉంటాయి. మా ఇద్దరిదీ ఒకటే స్కూలు. హైదరాబాద్ పబ్లిక్‌స్కూలు. నేను, చరణ్ ఇద్దరం సినిమా హీరోలుగా స్థిరపడ్డా కూడా, ఎంత బిజీ అయిపోయినా కూడా మా స్నేహంలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇప్పటికీ ఇద్దరం రెగ్యులర్‌గా కలుస్తుంటాం అన్నారు.

    స్నేహానికే ప్రాధాన్యం:

    స్నేహానికే ప్రాధాన్యం:

    తాప్సీ మాట్లాడుతూ... నాకున్న మంచి స్నేహితుల్లో నేను చెప్పే మొదటి పేరు... మంచు లక్ష్మి. మేం ఇద్దరం కలిసి రెండు సినిమాలకు చేశాం. నేను తనతో ఉన్నా లేకపోయినా లక్ష్మి ఎప్పుడూ నా గురించి మరొకరి దగ్గర వాఖ్యానించదు. విమర్శించదు. ఏ ఒక్కరోజూ ప్రతికూలంగా మాట్లాడినట్టు తెలియదు. నేను చేసిన ఓ సినిమా బాగా ఆడలేదు. ముంబయిలో ఉన్నా. అప్పుడే తన నుంచి ఫోన్‌ 'అనవసరంగా బాధపడకు. నువ్వు చాలా కష్టపడి పని చేస్తావు. ఓర్పుగా ఉండు... తప్పకుండా మంచి హిట్స్‌ వస్తాయి' అంటూ ధైర్యాన్ని నూరిపోసింది. స్నేహితులు చాలా మందే ఉంటారు. కానీ దానికెంతో విలువిస్తూ, ఎదుటివ్యక్తి బాధల్ని పట్టించుకుంటూ, అనుక్షణం అండగా ఉండే వాళ్లు తక్కువ మందే అంది.

    'నువ్వున్నావుగా లక్ష్మీ...' అంటుంది.

    'నువ్వున్నావుగా లక్ష్మీ...' అంటుంది.

    లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ... ఓసారి తాప్సీ కి పెద్ద సమస్య ఎదురైంది. ఇంట్లో వాళ్లకే కాదు... దాని గురించి నాకూ తెలియలేదు. ఏడాది పాటు బాధపడింది. ఆ సమయంలో ఓ సారి 'నీ సాయం కావాలి..' అంటూ చిన్న ఎస్సెమ్మెస్‌ పెట్టింది. నన్ను ఓ నిజమైన స్నేహితురాల్లా భావించి సమస్యను చెప్పినందుకు ఆనందం కలిగింది. వెంటనే నేను తన పక్కన ఉన్నా. మా కుటుంబం మొత్తం అండగా నిలబడ్డాం. తనకి కాస్త తీరిక దొరికితే కలిసి రెస్టారెంట్లకూ, షాపింగ్‌కీ వెళుతుంటాం. తను మాతో కలిసి షిరిడీ వచ్చింది. తిరుపతిలో మా స్కూల్‌ చూడ్డానికొచ్చి మాతో ఉంది. అప్పుడప్పుడూ ఇంటి మీద బెంగ మళ్లిందా అని అడుగుతుంటా. 'నువ్వున్నావుగా లక్ష్మీ...' అంటుంది.

    నా అర్థాంగే నా నేస్తం

    నా అర్థాంగే నా నేస్తం

    ఫ్రెండ్‌ షిప్‌ కొద్దీ ఎలాంటి నిర్వచనాలూ ఇవ్వదలచుకోలేదు. కానీ ఒక్కమాట. ఫ్రెండంటే ఫ్రెండే. వాడు దేవుడు కన్నా గొప్పోడు. దేవుడు దిగిరావాలంటే పూజలు, పునస్కారాలూ చేయాలి. అయినా వస్తాడనే నమ్మకం లేదు. స్నేహితుడు అలా కాదు. పిలవక పోయినా ప్రత్యక్ష్యం అవుతాడు. అడక్కపోయినా వరాలిస్తాడు. డబ్బులేనివాడూ కాదు.. స్నేహితుడు లేనివాడే నిజమైన పేదవాడు. ప్రస్తుతానికి నా అర్థాంగే నా నేస్తం. చివరిగా ఓ మాట. స్నేహమంటే ఇలాంటి 'దినాలు', తద్దినాలూ కాదు. అది జీవితం. దాన్ని ప్రతిరోజూ, ప్రతి క్షణం ఆస్వాదిస్తూనే ఉందాం''.

    కన్నీరు మిగిల్చి...

    కన్నీరు మిగిల్చి...

    దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.... ''స్నేహితుల దినోత్సవాలపై నమ్మకాల్లేవు గానీ, స్నేహం మీద మాత్రం కావల్సినంత ఉంది. మావూరు పెదకాకానిలో ప్రతి వీధిలోనూ నాకో గ్యాంగ్‌ ఉండేది. అందులో బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరంటే మాత్రం దేవ భక్తుని సత్యనారాయణ పేరే చెబుతా. వూర్లో మాకో స్డూడియో ఉండేది. రాత్రయితే అక్కడే మామకాం. నేను తప్పకుండా మంచి స్థాయికి వస్తానని మా ఇంట్లోవాళ్లకంటే బలంగా నమ్మేవాడు. చివరికి నాచేతుల్లోనే చనిపోయాడు. ప్రేమలో విఫలమై.. ఆత్మహత్య చేసుకొన్నాడు. కొన వూపిరిలో ఉండగా.. ఆసుపత్రికి తీసుకెళ్లా. మెట్లు ఎక్కుతుంటే ప్రాణాలు కోల్పోయాడు. ఆ క్షణాలు ఎప్పుడు గుర్తొచ్చినా గుండె బరువెక్కిపోతుంది''.

    రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...

    రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...

    నా జీవితాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు... సత్యేంద్ర రాకముందు, సత్యేంద్ర వచ్చిన తరువాత అని. సత్యేంద్ర నాకంటే రెండేళ్లు చిన్నవాడు. జ్ఞానంలో మాత్రం నాకంటే ఎన్నో రెట్లు పెద్దవాడు. మేం నవలలు చదివినట్టు తను ఇంజినీరింగ్ పుస్తకాలు చదివేవాడు. తను నాకు తాత్వికులను పరిచయం చేసేవాడు. వాళ్ల వాదాలను, వాదనలను వినిపించేవాడు. అతనితో మాట్లాడితే ప్లేటో నుంచి నీషే దాకా అందరితోనూ మాట్లాడినట్టుండేది. ఇక సినిమాల గురించి మాట్లాడితే... నాకు సినిమాల గురించి బాగా తెలుసు అన్నది ఉత్త భ్రమ అని తేలిపోయేది. నా అదృష్టం కొద్దీ కొన్ని విలువైన సంభాషణలు అతడు నాతో జరిపాడు. అవి నా జీవితాన్ని మార్చేశాయి. ఈ ప్రపంచంలో అయాన్‌ర్యాండ్ సృష్టించిన హోవార్డ్ రోర్క్‌లాంటి వాళ్లు నిజంగా ఉండరు అని నమ్మేవాళ్లకు నేను చెప్పేదొకటే. అలాంటి మనుషులుంటారు. అందులో ఒకరిని నేను కలిశాను. మాట్లాడాను. అంతే...

    English summary
    Friendship Day is a day for celebrating friendship. Initially created by the greeting card industry, evidence from social networking sites shows a revival of interest in the holiday that may have grown with the spread of the Internet, particularly in India. On the occasion our Telugu hero's talking about thier close friends.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X