ఈ రోజే సమ్మెపై మహేష్, ఎన్టీఆర్, పవన్ రిపోర్టు
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న సమ్మె కారణంగా పలు చిత్రాల షూటింగ్ లు నిలిచిపోయాయి. అటు తారలు, ఇటు సాంకేతిక నిపుణులు పనిలేక కూర్చున్నారు. నిర్మాతల మండలి, 24 క్రాప్ట్ మధ్య చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా చిత్రాల ఖర్చును తగ్గించే ఉద్దేశంతో అనేక వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా రాజమౌళి, హీరోలు మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, రామచరణ్, పవన్ కళ్యాణ్ తదితరులతో ఓ సమన్వయ కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఉన్నవారు హీరోల పారితోషికాలపై చర్చలు జరిపి, సినిమా పరిశ్రమ సంక్షోభంలో పడకుండా ఉండడానికి తాము అనుకున్న విషయాలను నేడు తెలియజేస్తారు. ఈ సందర్భంగా పలువురు హీరోలు తమ పారితోషికాల్ని తగ్గించుకొని నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











