twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కీరవాణిపై ఎదురుదాడి.. ఆయనే కాపాడగలరు.. వేటూరి తర్వాత.. భాస్కరభట్ల, శాస్త్రి ఫైర్!

    దర్శకులకు బుర్రలేదని, సమకాలీన గీత రచయితలను కించపరుస్తూ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చేసిన వాఖ్యలపై ఎదురుదాడి ప్రారంభమైంది.

    By Rajababu
    |

    దర్శకులకు బుర్రలేదని, సమకాలీన గీత రచయితలను కించపరుస్తూ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చేసిన వాఖ్యలపై ఎదురుదాడి ప్రారంభమైంది. ప్రముఖ గీత రచయితలు రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్‌లు కీరవాణిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాహుబలి2 ప్రీ రిలీజ్ రోజున కీరవాణి చేసిన ట్వీట్స్ వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పుడే కీరవాణి వ్యాఖ్యలపై మండిపడ్డారు.

    కీరవాణి ఏమన్నారంటే..

    కీరవాణి ఏమన్నారంటే..

    ‘బాహుబలి-2' ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు కొద్ది గంటల ముందు ఆయన చేసిన ట్వీట్లు విమర్శల పాలవుతున్నాయి. తెలుగులో బుర్ర తక్కువ దర్శకులు ఎక్కువని వ్యాఖ్యానించిన కీరవాణి.. తెలుగు గీత రచయితలపైనా తీవ్ర విమర్శలు చేశాడు. ‘వేటూరి సుందరరామ్మూర్తి మరణాంతరం, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాయడం తగ్గించిన తర్వాత తెలుగు పాట అంపశయ్య ఎక్కింది' అని కీరవాణి వ్యాఖ్యలు చేయడం పలువురిని షాక్ గురిచేసింది.

    ఆయనే కాపాడగలరు

    ఆయనే కాపాడగలరు

    ప్రముఖ గీతదర్శకుడు భాస్కరభట్ల రవికుమార్‌ కీరవాణిని ట్విట్టర్‌‌లో ఏకి పారేశాడు. ‘అంపశయ్య మీద ఉన్న సినిమా పాటల సాహిత్యాన్ని కీరవాణిగారే కాపాడగలరు. అయిదే నిమిషాలైతే అది సరిపోద్ది (‘విక్రమార్కుడు' సినిమా కోసం కీరవాణి రాసిన ఓ పాటలోని లైన్‌)'అని ట్వీట్‌ చేశాడు. ‘ఆయన స్వీయ సంగీత దర్శకత్వంలోనే కాకుండా వేరే సంగీత దర్శకులకీ పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నా. వేటూరి, సిరివెన్నెల తర్వాత నాకు బాగా నచ్చిన పాటల రచయిత కీరవాణిగారేన'ని అంటూ వ్యంగ్యాస్త్రాన్ని భాస్కరభట్ల సంధించడం చర్చనీయాంశమైంది.

    ఇప్పటి రచయితలు కూడా..

    ఇప్పటి రచయితలు కూడా..

    ‘జనతాగ్యారేజ్‌'లోని ‘ప్రణామం' పాటకు ఉత్తమ గీత రచయితగా ఐఫా అవార్డునందుకున్న రామజోగయ్య శాస్త్రి కూడా కీరవాణి వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించాడు. ‘మంచి సందర్భం ఉంటే ఇప్పటి గీత రచయితలు కూడా అద్భుతంగా రాయగలరు. చెత్త సన్నివేశం ఇస్తే సిరివెన్నెల కూడా చెత్తగానే రాస్తారు అని వేదికను ఆధారంగా చేసుకొని విమర్శించారు.

    అలా ఎందుకు అన్నారు.

    అలా ఎందుకు అన్నారు.

    ‘బాహుబలి1', ‘బాహుబలి2' లాంటి భారీ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని దేశ వ్యాప్తంగా సంగీత అభిమానుల ప్రశంసలు కీరవాణి అందుకొన్నారు. అలాంటి వ్యక్తి ఏ సందర్భాన్ని ఉద్దేశించి, లేదా ఎలాంటి పరిస్థుతుల్లో వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందోననే అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే రాజమౌళి చిత్రాలకు తప్ప ఏ దర్శకులకు మనసు పెట్టి ట్యూన్స్ ఇవ్వరు అనే విమర్శలు గతంలో కూడా వచ్చాయి. అలాంటి విమర్శలను మళ్లీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

    English summary
    Bhaskarabhatla Ravi Kumar, Rama Jogaiah Shastri attacked on keeravani over tweets before Baahubali pre release function. They criticised over keeravani tweets on telugu directors, and lyric writers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X