సినీ గేయరచయిత జాలాది కన్నుమూత

By Bojja Kumar

Jaladi
ప్రముఖ సినీ గేయ రచయిత జాలాది కన్నుమూశారు. గత కొంత కాలంగా మొదడు సంబంధ వ్యాధితో బాధ పడుతున్న ఆయన శుక్రకవారం విశాఖలో తుది శ్వాస విడిచారు. జాలాది పూర్తి పేరు జాలాది రాజారావు. ఆయన ఇప్పటి వరకు 275 సినిమాలకు గాను దాదాపు 1500 పై చికులు పాటలు రచించారు. జాలాది స్వస్థలం కృష్ణాజిల్లా దొండపాడు. జాలాది మరణంతో సినీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

'సూరట్టుకు సితుక్కు వానచుక్క" అంటూ జానపద బాణీలతో జన హృదయాలను ఉర్రూతలూగించినా, 'పుణ్యభూమి నాదేశం నమో నమామి"అంటూ దేశ భక్తిని ప్రేరేపించినా అది జాలాదికే చెల్లింది. బాల్యంలో అల్లరి చిల్లరి తిరుగుళ్లు, గొడవలు, పోలీసు కేసులు...ఆయనలోని కవితా సౌరభాన్ని కప్పి ఉంచాయి. కలం పేర్లతో మాత్రమే ఆ కవిత్వం వెలుగు చూసేది. ఉద్యోగానికి రాజీనామా చేశాక, జీవనం భారమైన నేపథ్యంలో మిత్రుల ఒత్తిడితో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు జాలాది. 'యాతమేసి తోడినా ఏరు ఎండదనీ"...'బండెళ్లి పోతుందోరన్నయ్యా.. బతుకు బండెళ్లి పోతుందోరన్నయ్యా" అని...రెండు దశాబ్దాలకుపైగా అనేక బతుకు దృశ్యాలను కళ్లకు కట్టించారు జాలాది రాజారావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X