యష్ కు షాకిచ్చిన తెలుగు మీడియా.. బన్నీకి జరిగిన అవమానాన్ని ఇలా తీర్చుకున్నారా ?
KGF సినిమాతో రాకింగ్ స్టార్ యష్ అద్భుతమైన క్రేజ్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అయితే ఆయనకు తెలుగు రిపోర్టర్లు షాక్ ఇచ్చారు. గతంలో అల్లు అర్జున్ బెంగళూరు వెళ్ళినప్పుడు కన్నడ రిపోర్టర్లు ఎలా అయితే ఆయనను ఊహించని ప్రశ్న వేసి ఇబ్బంది పెట్టారో అదే విధంగా తెలుగు రిపోర్టర్లు కూడా ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే..

14న ప్రపంచవ్యాప్తంగా
దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'KGF ఛాప్టర్ 2' ఒకటి. కన్నడ స్టార్ యశ్ హీరోగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న 'KGF 1'కు ఈ సినిమా ఇది స్వీకెల్. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించగా బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ఈ చిత్రంలో 'అధీరా' అనే బలమైన విలన్ గా కనిపించనున్నారు. సీనియర్ నటి రవీనా టాండన్, రావురమేష్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్ర పోషించారు.

దేశవ్యాప్తంగా ప్రమోషన్స్
ఇక సినిమా విడుదల దగ్గర పడిన క్రమంలో శరవేగంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తుంది సినిమా యూనిట్. ఇందులో భాగంగా ముందుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించే రూట్‌మ్యాప్‌ను కూడా విడుదల చేసింది. అలా ఏప్రిల్ 10 సాయంత్రం 6.30 గంటలకు తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించిన సినిమా యూనిట్ 11వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

అసహనాన్ని వ్యక్తం చేస్తూ
అటు నుంచి విశాఖ వెళ్లి ఉదయం 11.30 గంటలకు వైజాగ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించాల్సి ఉంది. అయితే పదకొండున్నరకు సమాచారం ఇచ్చారు అని విలేఖరులు అందరూ అదే సమయానికి వెళ్లి కూర్చున్నారు. కానీ 11.30 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పి యష్ అండ్ టీమ్ 12.30కు వెళ్లారు. దీంతో తెలుగు మీడియా ప్రతినిధులు అసహనాన్ని వ్యక్తం చేశారు. ఓ విలేఖరి యష్ మొహం మీదే ఈ విషయాన్నీ అడిగేశాడు.

అల్లు అర్జున్ కాస్త లేట్ గా
మీరు ప్రెస్ మీట్ చెప్పిన టైం ఏంటి? వచ్చే టైం ఏంటి ? గంటన్నర నుంచి ఇంతమంది జర్నలిస్టులు వెయిట్ చేస్తున్నారు అని కూడా తెలియడం లేదా అంటూ ఫైర్ అయ్యారు. అయితే తనకు అసలేం జరుగుతుందో కూడా తెలీదు, నిర్మాతలు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తున్నాను అని, 10 మినిట్స్ లేట్ అయినా తప్పేనని అంటూ ఒప్పుకున్న యష్ సారీ చెప్పారు. అయితే ఇది బన్నీని అవమానించిందనాయికి రివెంజ్ అని అంటున్నారు. అదేంటంటే "పుష్ప" విడుదల సమయంలో కర్ణాటకలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా, అక్కడికి అల్లు అర్జున్ కాస్త లేట్ గా వెళ్లారు.

రివెంజ్ తీర్చుకున్నారు
దీంతో ప్రెస్ మీట్ కు లేటుగా రావడమేమిటి ఇక్కడ ఉన్నవాళ్లకు పని లేదా? అంటూ కన్నడ మీడియా ఫైర్ అయ్యింది. దానికి అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. ఇప్పుడు అదే సీన్ వైజాగ్ లో రిపీట్ అయిందన్నమాట. అలా మనవాళ్ళు అల్లు అర్జున్ కు జరిగిన అవమానానికి రివెంజ్ తీర్చుకున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. న్నట్టు సాయంత్రం 7గంటలకు హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించడానికి సమాచారం ఇచ్చారు. మరి ఈ సమావేశానికి అయినా కరెక్ట్ గా వెళ్తారో లేక మళ్ళీ లేట్ అవుతుందో? లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











