Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
లవ్ మాక్ టెయిల్.. తెలుగుకు వచ్చేసరికి గుర్తుందా సీతాకాలం అయిందే!
ఈ మధ్య కన్నడ, మళయాళం సినిమాల రీమేకులపై పడ్డ తెలుగు జనం, అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను తర్జమా చేసేస్తూ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తున్నారు. ఇదే కోవలో ఈ జనవరిలోనే కన్నడ నాట విడుదలై మంచి స్పందన రాబట్టుకున్న మాక్ టెయిల్ సినిమాను కూడా టాలీవుడ్ కు తీసుకువచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని తెల్గీకరించేందుకు టైటిల్ నుంచి కసరత్తులు ప్రారంభించారు చిత్ర బృందం.
మిల్కీ బ్యూటీ తమన్నా, టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ లవ్ మాక్ టెయిల్ రీమేక్ లో లీడ్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఓ క్రేజీ టైటిల్ కూడా ఉంటే బాగుంటుందని భావించిన దర్శక-నిర్మాతలు గుర్తుందా సీతాకాలం అన్న టైటిల్ ను ఖరారు చేశారట.
నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుర్తుందా సీతాకాలం సెప్టెంబరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఇతర పాత్రలకు క్యాస్టింగ్ నడుస్తోంది. త్వరలోనే ఇతర పాత్రధారులను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మరి కన్నడ నాట విమర్శకుల ప్రశంసలు అందుకున్న లవ్ మాక్ టెయిల్ తెలుగులో గుర్తుందా సీతాకాలంగా ప్రేక్షకులను ఏ రీతిన అలరిస్తుందో చూడాలి.