తప్పుడు పనులు చేయాలని హింసించాడు, ఆ ఆలోచనే ఉంటే హీరోయిన్ అయ్యేదాన్ని: నటి రాగిణి
Recommended Video
తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రాగిణి. సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాగిణి తన జీవన ప్రయాణంలో పడ్డ కష్టాల గురించి వెల్లడించారు.
నాకు 9 సంవత్సరాల వయసు ఉన్నపుడే నాన్నగారికి పెరాలసిస్ వచ్చి కాళ్లు, చేతులు పడిపోయాయి. దీంతో నన్ను అమ్మవాళ్లు పెంచలేక పోయారు. చదివించలేక పోయారు. అక్క కృష్ణవేణి తీసుకెళ్లి డాన్స్ నేర్చించడంతో ప్రదర్శనలు ఇస్తూ వచ్చిన డబ్బులతో ఇంటి ఖర్చులు వెల్లదీసేదాన్ని అని రాగిణి చెప్పుకొచ్చారు.

నటిగా 35 ఏళ్ల ప్రయాణం
నటిగా ప్రయాణం ప్రారంభించి 35 యేళ్లు పూర్తయినట్లు రాగిణి వెల్లడించారు. దూరదర్శన్‌లో వచ్చే సీరియల్స్ ద్వారా నా కెరీర్ ప్రారంభం అయింది. తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

12 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు
‘‘నాకు 12 ఏళ్ల వయసు ఉన్నపుడే మా పెద్దక్క తీసుకెళ్లి ఒకాయనతో పెళ్లి చేసింది. సరిగ్గా సంవత్సరం కలిసి ఉన్నాం. ఆ సమయంలోనే నాకు బాబు పుట్టాడు. ఆయనకు యాక్టింగ్ ఫీల్డ్ అంటే చెత్త తిరుగుడు తిరిగే ఫీల్డ్ అనకునేవాడు. నన్ను హింసించడం మొదలు పెట్టాడు' అని రాగిణి తెలిపారు.

పెళ్లైన ఆరు నెలల నుంచి హింస మొదలైంది
‘పెళ్లైన 6 నెలల నుంచే భర్త నన్ను హింస పెట్టడం మొదలు పెట్టాడు. నువ్వు కూడా తప్పుడు తిరుగుళ్లు తిరిగి సంపాదించొచ్చుకదా...అలా ఎందుకు సంపాదించవు అని వేధించేవాడు. లేకుంటే ఎవడి దగ్గరికైనా వెళ్లి సంపాదించుకురా అని బలవంతం చేసేవాడు' అని రాగిణి గుర్తు చేసుకున్నారు.

అలా చేసేదాన్నయితే ఎప్పుడో హీరోయిన్ ఛాన్స్ వచ్చేది
అలాంటి తప్పుడు పనులు చేయడం ఇష్టం ఉంటే ఎప్పుడో సినిమా హీరోయిన్ అయ్యేదాన్ని, అవన్నీ ఇష్టం లేకనే మామూలు నటిగా ఉన్నాను. అలాంటి నీచం నేను చేయలేనని చెప్పినా వినేవాడు కాదు. అన్నం పెట్టి పోషిస్తావని చెప్పి నమ్మి పెళ్లి చేసుకుని ఇక్కడకు వచ్చాను అని చెప్పి బాధపడ్డా అతడు మారలేదని రాగిణి తెలిపారు.

నా కొడుకు పేరు కిరణ్, జర్మనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
అతడి వేధింపులు, హింస భరించలేక సంవత్సరం తర్వాత విడిపోయాను. ఆ సమయంలో పెళ్లి ఫోటోలన్నీ తగలబెట్టేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అక్క పిల్లలను తీసుకొచ్చి నా కొడుకుతో పాటు వారిని చదివిస్తూ, వారితో కలిసి ఉంటూ.. సీరియల్స్, సినిమాల్లో నటించడం మొదలు పెట్టాను. నా కుమారుడి పేరు కిరణ్. జర్మనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. నేను చదివించిన మా అక్క పిల్లలు కూడా బాగా సెటిలయ్యారు. అంతా నన్ను ఎంతో బాగా చూసుకుంటారని రాగిణి తెలిపారు.


Click it and Unblock the Notifications