Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
తప్పుడుదారి కాదు: వేశ్యలుగా హారోయిన్లు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : చాలా మంది యువతులు రంగుల సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టి హీరోయిన్ కావాలని కలలు కనడం....అవకాశాలు దొరక్క చివరకు బ్రతుకు దెరువు కోసం నిజ జీవితంలో వ్యబిచార వృత్తిలోకి దిగడం, తప్పుడు దారిలో ప్రయాణిస్తుండటం లాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. వాళ్ల సంగతి పక్కన పెడితే పలువురు భామలు మాత్రం హీరోయిన్స్‌గా సక్సెస్ అయి రీల్ లైఫ్ లో వేశ్య పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.
ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లు సైతం వేశ్య పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పెర్ఫార్మెన్స్ పరంగా గుర్తింపు తెచ్చుకోవాలన్నా, విమర్శకుల ప్రశంసలు, అవార్డులు దక్కించుకోవాలన్నా వేశ్య పాత్రలు ఎంచుకోవడం ఒక మంచి ఆప్షన్‌గా వారు భావిస్తున్నారు. అలా అని ఇవి అంత సులభంగా చేయగలిగే పాత్రలు కావు. చాలా కష్టతరమైన పాత్రలు. బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్, రొమాన్స్.....ఇలా ఎన్నో షేడ్స్ ప్రదర్శించాల్సి వస్తుంది.
థియేటర్లకు వచ్చే సినీ జనాలను మెప్పించడానికే వారు ఈ వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. ఇప్పటి వరకు వెండి తెరపై వేశ్యలుగా మెరిసిన హీరోయిన్ల వివరాలు స్లైడ్ షోలో.....

సంగీత
హీరోయిన్ సంగీత 2008లో వచ్చిన ‘ధనం' చిత్రంలో వేశ్య పాత్రలో నటించింది. తమిళంలో రూపొందిన ఈచిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేసారు. ఈ చిత్రంలో సంగీత నటనకు మంచి పేరు వచ్చింది. అయితే సినిమా మాత్రం బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

అనుష్క
2010లో వచ్చిన వేదం చిత్రంలో అనుష్క వేశ్య పాత్రలో నటించింది. ఇందులో అనుష్క పోషించిన సరోజ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈచిత్రంలో అల్లు అర్జున్, మనోజ్ ముఖ్య పాత్రలు పోషించారు.

బింధు మాధవి
ఆవకాయ్ బిర్యానీ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన తెలుగు నటి బింధు మాధవి 2011లో వచ్చిన గౌతం మీనన్ చిత్రం ‘సెగ'లో వేశ్య పాత్ర పోషించింది. సినిమా పెద్దగా ఆడక పోయినా బింధుమాధవికి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.

చార్మి
హీరోయిన్ చార్మి త్వరలో తెరపై వేశ్యగా కనిపించబోతోంది. టెన్త్ క్లాస్, నోట్ బుక్ చిత్రాల దర్శకుడు చందు ఈ సినిమాకు దర్శకుడు. బేబి హ్యాపీ సమర్పణలో డి. వెంకట సురేష్, కె. సూర్య శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

శ్రీయ
దేవస్థానం ఫేం జనార్ధన మహర్షి ‘పవిత్ర' పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఆమె ఓ పవిత్ర అనేది ట్యాగ్ లైన్. ఈచిత్రంలో శ్రీయ వేశ్య పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అలాగే ఓ బెంగాళీ చిత్రంలోనూ వేశ్యగా నటిచేందుకు రెడీ అవుతోంది ఈ భామ.

మీనా కుమారి
బాలీవుడ్లో మొట్టమొదటిసారిగా వేశ్య పాత్ర పోషించిన నటి మీనా కుమారి. ఆమె చివరగా పాకిజా అనే చిత్రంలో లక్నో బేస్డ్ వేశ్యగా నటించింది.

రేఖ
నిన్నటి తరం ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ...ఉమ్రావ్ జాన్ చిత్రంలో వేశ్య పాత్రలో నటించింది.

రాణి ముఖర్జీ
బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ సావరియా, లాగా చునారి మే చిత్రాల్లో వేశ్య పాత్రల్లో నటించింది.

మాధురి దీక్షిత్
నిన్నటి తరం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ దేవదాస్ చిత్రంలో వేశ్య పాత్రలో నటించింది.

కల్కి కోచ్లిన్
బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్ ‘దేవ్ డి' చిత్రంలో వేశ్య పాత్రలో నటించింది.

కరీనా కపూర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ రెండు స్లార్ వేశ్య పాత్రల్లో నటించింది. చమేలీ చిత్రంతో పాటు తలాష్ చిత్రంలో ఆమె వేశ్య పాత్రలు పోషించింది.

మనీషా కొయిరాలా
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా కూడా పలు చిత్రాల్లో వేశ్యగా నటించింది.

శృతి హాసన్
హీరోయిన్ శృతి హాసన్ ఇటీవల వచ్చి బాలీవుడ్ మూవీ డి డే చిత్రంలో వేశ్య పాత్రలో నటించింది. అర్జున్ రాంపాల్‌తో కలిసి హాట్ హాట్ సీన్లలో నటించింది.

టబు
టాలెంటెడ్ నటి టబు బాలీవుడ్ చిత్రం ‘చాందినీ బార్'లో వేశ్య పాత్రలో నటించింది. బార్ డాన్సర్ల జీవితం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో నటనకు ఆమె పలు అవార్డులు దక్కించుకుంది.

ప్రీతి జింతా
చోరీ చెరీ చుప్కే చుప్కే చిత్రంలో హీరోయిన్ ప్రీతీ జింతా కూడా వేశ్య పాత్రలో నటించింది.