twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ 2013: టాప్ 10 హిట్ మూవీస్

    By Bojja Kumar
    |

    సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం దాదాపు 600 సినిమాలు నిర్మాణమయ్యాయి. తెలుగు, తమిళం,కన్నడ, మళయాలం చిత్రసీమల్లో ఈ సంవత్సరం చాలా బిజీబిజీగా సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఎకనామికల్‌గా ఎక్కువ సక్సెస్ రేటు చవిచూసింది మాత్రం తెలుగు సినిమా పరిశ్రమనే అని అంటున్నారు విశ్లేషకులు.

    ఈ సంవత్సరం తెలుగులో 100కుపైగా చిత్రాలు విడుదలయ్యాయి. భారీ బడ్జెట్ చిత్రాలైన 'అత్తారింటికి దారేది', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', నాయక్, మిర్చి, బలుపు, బాద్ షా చిత్రాలు బాక్సాఫీసు వద్ద తమ సత్తా చాటాయి. మరి టాప్-10లో ఏయే చిత్రాలు చోటు దక్కించుకున్నాయో ఓ సారి చూద్దాం.

    అత్తారింటికి దారేది

    అత్తారింటికి దారేది

    సినిమా విడుదలకు ముందే సీడీలు లీకైనప్పటికీ....పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం బాక్సాఫీసు వద్ద నెం.1 కలెక్షన్లతో సత్తా చాటింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం....రూ. 100 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం.

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

    సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

    ప్రముఖ నిర్మాత దిల్ రాజు,శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్‍‌గా తెరకెక్కిన ఈచిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీసు వద్ద ఈచిత్రం రూ. 55 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం.

    నాయక్

    నాయక్

    రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నాయక్' చిత్రం 35 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణమై....రూ. 60 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

    మిర్చి

    మిర్చి

    కొరటాల శివ దర్శకత్వంలో...ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిర్చి'. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణమైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 55 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

    బాద్ షా టోటల్ కలెక్షన్

    బాద్ షా టోటల్ కలెక్షన్

    శ్రీను వైట్ల దర్వకత్వంలో ఎన్టీఆర్, కాజల్ జంటగా తెరకెక్కిన కామెడీ అండ్ యాక్షన్ మూవీ ‘బాద్ షా' దాదాపు రూ. 50 కోట్ల బిజినెస్ చేసింది.

    ఇద్దరమ్మాయిలతో

    ఇద్దరమ్మాయిలతో

    అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రం కూడా మంచి బిజినెస్ చేసింది.

    బలుపు

    బలుపు

    రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బలుపు. ఈచిత్రం రూ. 40 కోట్లు వసూలు చేసి ప్లాపుల బాటలో ఉన్న రవితేజను ఒడ్డుకు చేర్చింది.

    ప్రేమ కథా చిత్రమ్

    ప్రేమ కథా చిత్రమ్

    కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ప్రేమ కథా చిత్రమ్' మూవీ భారీ విజయం సాధించి నిర్మాతలకు పదింతల లాభాలు తెచ్చిపెట్టింది.

    స్వామిరారా

    స్వామిరారా

    నికిల్, స్వాతి జంటగా తెరకెక్కిన ‘స్వామిరారా' చిత్రం కేవలం రూ. 4 కోట్లతో నిర్మాణమై.....రూ. 15 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

    వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్

    వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్

    సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన చిన్న బడ్జెట్ మూవీ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' మూవీ దాదాపు రూ. 13 కోట్లు వసూలు చేసి.....హిట్ చిత్రంగా నిలిచింది.

    English summary
    South Indian film industry has produced over 600 films in the Tamil, Telugu, Kannada and Malayalam marking it one of the busiest years. In Tollywood, comedy and family entertainers has proved to be economically successful at the Box Office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X