»   » టాప్-10 టాలీవుడ్ ఐటం సాంగ్స్ (ఫోటో ఫీచర్)

టాప్-10 టాలీవుడ్ ఐటం సాంగ్స్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కారణాలేమైనా తెలుగు సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించాలంటే సినిమాల ఐటం సాంగులు తప్పనిసరయ్యాయి. ఈ ట్రెండు తెలుగు సినిమాల్లో చాలా ఏళ్ల క్రితమే ప్రారంభం అయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో పాపులర్ అయిన ఐటం సాంగుల్లో ప్రత్యేకించి జ్యోతిలక్ష్మి, జయమాలిని లాంటి డాన్సింగ్ స్టార్లు ఉండే వారు. అదరిపోయే స్టెప్పులేస్తూ అందాలు ఆరబోస్తూ వారు ఇచ్చే హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్ చూసేందుకు జనాలు ఎగబడే వారు.

అయితే ఆ కాలంలో ఐటం సాంగులు అంటే ఫ్యామిలీ ప్రేక్షకులు పెదవి విరిచే వారు. వాటిని అశ్లీల కేటగిరీ కింద లెక్కగట్టేవారు. రాను రాను ఐటం సాంగు తీరు మారడంతో పాటు ప్రేక్షకుల్లో ఆ లాంటి సాంగ్స్ పై అభిప్రాయం కూడా మారింది. ఇప్పుడు ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఐటం సాంగులను ఆస్వాదించేలా దర్శకులు వాటిని తెరకెక్కిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హీరోయిన్లు, స్పోర్ట్స్ స్టార్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఐటం సాంగులు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. టాలీవుడ్లో 2013 సంవత్సరంలో టాప్ 10 ఐటం సాంగులపై ఓ లుక్కేద్దాం...

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది


పవర్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది' చిత్రంలో ఇట్స్ టైం టు పార్టీ అంటూ సాగే ఐటం సాంగ్ టాప్ లిస్టులో చోటు దక్కించుకుంది. ఈ పాటలో పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత, ముంతాజ్, హంసా నందిని అదరగొట్టాడరు. ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసారు.

బాద్‌షాలో అదరగొట్టిన నికోల్

బాద్‌షాలో అదరగొట్టిన నికోల్


జూ ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా' చిత్రంలో హాట్ లేడీ నికోల్ ‘వెల్‌కం కనకం' అనే సాంగులో అదరగొట్టింది. ఈ సాంగు 2013లో మోస్ట్ పాపులర్ సాంగుగా మారింది. తమన్ ఈ సాంగును కంపోజ్ చేసారు. ఈ పాటను భాస్కరభట్ల రచించారు. సౌమ్యరావు, జస్ర్పీత్ పాడారు.

నాయక్ లో చార్మి ‘నెల్లూరే' సాంగ్

నాయక్ లో చార్మి ‘నెల్లూరే' సాంగ్


ఆ మధ్య నాగార్జున డమరుకం సినిమాలో చాయ్ సాంగుతో షేక్ చేసిన చార్మి...ఈ సంవత్సరం రామ్ చరణ్ హీరోగా రూపొందిన ‘నాయక్' సినిమాలో ‘నెల్లూరే' సాంగుతో కేక పుట్టించింది. ఈ సాంగులో రామ్ చరణ్, చార్మి స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మిర్చిలో సెగలు రేపిన హంసా నందిని

మిర్చిలో సెగలు రేపిన హంసా నందిని


ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘మిర్చి' చిత్రం‌లో ఐటం భామ హంసా నందిని తన అందచందాలతో ఆకట్టుకుంది. సినిమాకు కీలకంగా మారిన అంశాల్లో ఈ పాట కూడా ఉందటం విశేషం.

టాప్ లేచిపోద్ది

టాప్ లేచిపోద్ది


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో అల్లుఅర్జున్-కేథరిన్ చేసిన టాప్ లేచిపోద్ది సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

జ్వాలా గుత్త ఐటం సాంగ్

జ్వాలా గుత్త ఐటం సాంగ్


బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన జ్వాలా గుత్తా తన ఫ్రెండ్ నితిన్ నటించిన ‘గుండె జారి గల్లంతయ్యిందే'చిత్రం కోసం ఐటం భామ అవతారం ఎత్తింది. జ్వాల ఐటం సాంగు చేయడం ఏమిటీ అని అంతా ఆశ్యర్చ పోయారు. విడుదలకు ముందు ఈ అంశం సినిమాపై అంచనాలు పెంచింది. అయితే ఆమె మాత్రం ఐటం సాంగులో ఆకట్టుకోలేక పోయింది.

బలుపులో లక్ష్మీరాయ్ ఐటం సాంగ్

బలుపులో లక్ష్మీరాయ్ ఐటం సాంగ్


సౌతిండియా పాపులర్ హీరోయిన్లలో ఒకరైన లక్ష్మీరాయ్ రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘బలుపు' చిత్రంలో ప్రత్చేకంగా ఐటం సాంగు చేసి అలరించింది. లక్ష్మీరాయ్ ఐటం సాంగు సినిమాకు బాగా ప్లస్సయింది.

ఆ ఈది కుర్రోడు

ఆ ఈది కుర్రోడు


గుండెల్లో గోదారి చిత్రంలో ఆ ఈది కుర్రోడు...అనే ఐటం సాంగు కూడా థియేటర్లో దుమ్ము రేపింది.

మోస్ట్ వాంటెడ్

మోస్ట్ వాంటెడ్


నాగార్జున భాయ్ చిత్రంలో మెస్ట్ వాంటెడ్ ఐటం సాంగు కూడా టాప్ 10 ఐటం సాంగుల్లో చోటు దక్కించుకుంది.

అడ్డా ఐటం సాంగ్

అడ్డా ఐటం సాంగ్


అడ్డా చిత్రంలో సుశాంత్-శ్వేతా భరద్వాజ్ కలిసి చేసిన ఐటం ‘హే ఊలాలా' సాంగ్ కూడా టాప్ 10 ఐటం సాంగుల్లో చోటు దక్కించుకుంది.

English summary
The trend of item numbers in Tollywood dates back to 1970s and the experts from the industry opine that reviving this trend has proved beneficial in recent years. These kind of songs have a key role in the success of movies. Many Telugu filmmakers treat them as one of their success mantras. They release the dance numbers to create hype for their films. The success of the item songs will have a big impact of trade dynamics of any Telugu films.
Please Wait while comments are loading...