2019 బాక్సాఫీస్ రిపోర్ట్: వరుస ప్లాపులతో దద్దరిల్లిన టాలీవుడ్!

తెలుగు సినిమా పరిశ్రమకు 2019 సంవత్సరం ప్రారంభం నుంచి గట్టి దెబ్బలే తగులుతున్నాయి. సంక్రాంతికి విడుదలైన పెద్ద చిత్రాలు భారీ నష్టాలను మిగల్చగా... ఆ తరువాత సైతం వరుస ప్లాపులతో బాక్సాఫీస్ దద్దరిల్లి పోయింది.

అత్యంత కీలకమైన సంక్రాంతి సీజన్లో మూడు పెద్ద సినిమాలు విడుదలైతే అందులో 'ఎన్టీఆర్ బయోపిక్', 'వినయ విధేయ రామ' ప్లాప్ అవ్వగా... 'ఎఫ్ 2' మాత్రమే నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఫిబ్రవరిలో ఒక్కట్టంటే ఒక్క హిట్ సినిమా కూడా నమోదు కాలేదు.

తొలి త్రైమాసికంలో చెప్పకోదగ్గ హిట్ ఒకటి మాత్రమే

తొలి త్రైమాసికంలో చెప్పకోదగ్గ హిట్ ఒకటి మాత్రమే

2019 తొలి త్రైమాసికంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ హిట్టు కేవలం ‘ఎఫ్ 2' మాత్రమే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కీలక పాత్రలు పోషించారు. దిల్ రాజు నిర్మించగా రూ. 130 కోట్ల పై చిలుకు గ్రాస్ వసూలు చేసి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

జనవరిలో రిలీజైన చిత్రాలు

జనవరిలో రిలీజైన చిత్రాలు

జనవరిలో ఎన్టీఆర్ కథానాయుడు, పేట, వినయ విధేయ రామ, ఎఫ్ 2, మిస్టర్ మజ్ను, నయనతార నటించిన లేడీ టైగర్ విడుదలైంది. ఎఫ్ 2 మూవీ తప్ప అన్ని చిత్రాలు నష్టాలనే మగిల్చాయి.

ఫిబ్రవరిలో ఒక్క హిట్టు పడలేదు

ఫిబ్రవరిలో ఒక్క హిట్టు పడలేదు

ఫిబ్రవరి నెలలో యాత్ర, మిఠాయి, ఎన్టీఆర్ మహానాయకుడు, ప్రేమెంత పని చేసే నారాయణ, 4 లెటర్స్ సినిమాలతో పాటు.. అనువాద చిత్రాలైన అంజలి సిబిఐ, దేవ్, లవర్స్ డే, విచారణ, సీమరాజా తదితర చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ఇవేవీ కూడా హిట్ సినిమాల లిస్టులో చోటు దక్కించుకోలేదు. యాత్ర మూవీకి మంచి టాక్ వచ్చినప్పటికీ లాభాలు రాలేదు.

మార్చి రిపోర్ట్

మార్చి రిపోర్ట్

మార్చి నెలలో 118, క్రేజీ క్రేజీ ఫీలింగ్, బొట్టు, మాగ్నెట్, బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్, మౌనమే ఇష్టం, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, చీకటి గదిలో చితక్కొట్టుడు, వినరా సోదర వీర కుమార, ఐరా, సూర్యకాంతం, లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీతో పాటు అనువాద చిత్రాలైన విశ్వాసం, పులి జూదం, జెస్సి, సర్వంతాళమయం, లవ్ గేమ్ చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులో కేవలం 118, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాలు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి.

ఎఫ్ 2 తర్వాత... 118 మాత్రమే

ఎఫ్ 2 తర్వాత... 118 మాత్రమే

మూడు నెలల రిపోర్ట్ పరిశీలిస్తే జనవరిలో వచ్చిన ‘ఎఫ్ 2' తర్వాత 118 చిత్రం మాత్రమే నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. మార్చి నెలాఖరున విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్, సూర్యకాంతం వసూళ్లు పరిస్థితి ఏమిటనేది తొలి వారం గడిస్తే కానీ చెప్పలేం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X