#TeluguPeopleWithRajinikanth -రజనీ సింగిల్‌ సింహం.. వాళ్లే గుంపులు గుంపులుగా: రోజా, నానిపై ట్రోలింగ్

సూపర్ స్టార్ రజనీకాంత్ విజయవాడలో జరిగిన స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు విజన్ 2020 గొప్పది. ఆయన విజన్ వల్లే హైదరాబాద్ మరో న్యూయార్క్ లాంటి విశ్వనగరంగా మారింది. ప్రస్తుతం ఆయన రచిస్తున్న విజన్ 2047 విజన్‌తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఇండియాలోనే నంబర్ వన్ అవుతుందని కామెంట్ చేశారు. అయితే చంద్రబాబుపై పొగడ్తలు చేయడంతో రజనీకాంత్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఈ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటే?

ట్విట్టర్‌లో రెండు రోజులుగా ట్రెండింగ్‌గా : సూపర్ స్టార్ రజనీకాంత్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రోజా సెల్వమణి, కొడాలి నాని, జోగి రమేష్ లాంటి నేతలు దారుణంగా ఆరోపణలు చేశారు. రజనీకాంత్‌ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా పరుష పదజాలంతో దూషించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో #TeluguPeopleWithRajinikanth, #YSRCPApologizeRAJINI హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్ అవుతున్నాయి.

Rajinikanth

రజనీకాంత్ సినిమాలో డైలాగ్స్ : రజనీకాంత్‌పై దూషించిన నేతలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ట్విట్టర్‌లో ఓ నెటిజన్ స్పందిస్తూ.. రజనీకాంత్ ఎప్పుడో తన సినిమాలో ఓ డైలాగ్ చెప్పారు. పందులే గుంపులుగా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది. ఆయన సింగిల్‌గా వచ్చిపోయాడు. కానీ వైసీపీ పందులే గుంపుగా వచ్చి బురదలో దొర్లుతున్నాయి అని కామెంట్ చేశాడు.

మీరంటే తెలుగు ప్రజలకు గౌరవం : రజనీకాంత్ సార్.. మీరంటే తెలుగు ప్రజలకు చాలా గౌరవం. రోజా సెల్వమణి, వైఎస్ జగన్ లాంటి నేతలను విస్మరించండి. మీరు వారిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం పిచ్చి పట్టినట్టు విమర్శించారు. ఇక్కడి రాజకీయాల్లో కొందరు ఇడియెట్స్ ఉన్నారు అంటూ ఓ మహిళ ఘాటుగా స్పందించింది.

తలైవా ఫ్యాన్స్‌ను తక్కువగా అంచనా వేయవద్దు : తలైవర్‌ను తక్కువగా అంచనా వేయవద్దు. ఆయన ఫ్యాన్స్‌ను కూడా తక్కువ అంచనా వేయవద్దు. సముద్రం లాంటి రజనీ అభిమాన గణం తుఫాన్ సృష్టిస్తారు. వారు వైసీపీని ముంచేసే సునామీని సృష్టించడానికి ఏ మాత్రం సమయం అక్కర్లేదు అని మరో నెటిజన్ ట్వీట్ చేశారు.

మీనా ఇండస్ట్రీలోకి వచ్చి : హీరోయిన్ మీనా ఇండస్ట్రీలోకి వచ్చి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా జరిగిన సభలో రోజా మాట్లాడిన వీడియోను పెట్టి.. హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడు రోజా జీరో అయిపోయింది. రజనీకాంత్‌తో పెట్టుకోకు జాగ్రత్త అని ఓ నెటిజన్ వీడియోను పోస్టు చేశాడు.

రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా : రజనీకాంత్‌కు 32 దేశాల్లో అభిమానులు ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్లినా రజనీకాంత్ సినిమాలకు అభిమానులు ఉంటారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మాత్రం 32 సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్నారు. వైఎస్ జగన్ కరప్షన్ స్టార్ అంటూ తెలుగు దేశం నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ట్వీట్ చేశారు.

వైసీపీని ఏమీ అనకపోయినా...: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రజినీకాంత్ గారు ఒక్క మాట అన్నాడా? జగన్ రెడ్డి‌పై ఒక్క విమర్శ చేసాడా? ఏమి అనకపోయినా వైసీపీ వాళ్ళు విషం కక్కటం చూస్తేనే వీళ్ళు ఎలాంటి సైకోలో అర్ధమవుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

వైసీపీపై విరుచుకుపడ్డ టీడీపీ నేతలు: రజనీకాంత్‌పై విరుచుకుపడ్డ వైసీపీ నేతలపై తెలుగుదేశం నేత దీపక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సినిమాలో ఒక్కడే విలన్ ఉంటాడు... ఇక్కడ గుంపుగా ఉన్నారేంటి?" అని రజనీకాంత్ గారు అనుకుని ఉండొచ్చు అంటున్నారు తెలుగుదేశం నేత జి. దీపక్ రెడ్డి గారు. ఆయన మాటల వెనుక కథేంటో తెలుసుకుందాం అంటూ టీడీపీ ట్విట్టర్ పేజ్‌లో వీడియోను పోస్టు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X