ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్‌లో తెలుగు సినీ నిర్మాత

విచారణకు హాజరుకావాలంటూ సదరు నిర్మాతకు సమాచారం ఇచ్చామని, త్వరలో ప్రశ్నించనున్నామని ముంబయి క్రైంబ్రాంచ్‌కు చెందిన ఒక అధికారి తెలియజేశారు.మరోప్రక్క తెలుగుకి చెందిన ఓ కాస్టింగ్ డైరక్టర్ శీశాంత్ కు మోడల్స్ ఫోటోలు పంపారని తెలుస్తోంది. సినిమాల్లోకి రావాలనుకుంటున్న వర్ధమాన మోడల్స్ ఫోటోలు శ్రీశాంత్ ల్యాప్ టాప్ లో దొరికాయి.
స్పాట్‌ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్త్టెన శ్రీశాంత్ కంపెనీ 'ఎస్ 36'లో ఈ నిర్మాతకు భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఎస్ 36 కంపెనీ.. మినరల్ వాటర్, క్రీడాసామగ్రి, దుస్తుల సరఫరా రంగంలో ఉంది. మరోవైపు, శ్రీశాంత్‌కు పలువురు మహిళా మోడల్స్ ఫొటోలు పంపించిన బాలీవుడ్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం ప్రశ్నించారు.
ఎస్ 36 కంపెనీ ప్రకటనల కోసం మోడళ్లను ఎంపిక చేయటానికి శ్రీశాంత్ కావాలంటే ఫొటోలు పంపించానని ఆ వ్యక్తి చెప్పారన్నారు. శ్రీశాంత్ ఈమెయిల్ ఖాతాలో డజన్ల కొద్ది అమ్మాయిల ఫొటోలున్నాయని.. వీరిలో పలువురితో ఆయన సన్నిహితంగా మెలిగినట్లు తేలిందని ముంబయి పోలీసు వర్గాలు తెలిపాయి.


Click it and Unblock the Notifications











