twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐపీఎల్‌ స్పాట్‌ఫిక్సింగ్‌లో తెలుగు సినీ నిర్మాత

    By Srikanya
    |

    Telugu Producer in IPL Spot Fixing
    ముంబయి: ఐపీఎల్‌ స్పాట్‌ఫిక్సింగ్‌లో తెలుగు సినీ నిర్మాత ఇరుక్కున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐపీఎల్‌ స్పాట్‌ఫిక్సింగ్‌ వ్యవహారంతో పేరు బయిట పెట్టని తెలుగు సినీ నిర్మాతకు ఒకరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    విచారణకు హాజరుకావాలంటూ సదరు నిర్మాతకు సమాచారం ఇచ్చామని, త్వరలో ప్రశ్నించనున్నామని ముంబయి క్రైంబ్రాంచ్‌కు చెందిన ఒక అధికారి తెలియజేశారు.మరోప్రక్క తెలుగుకి చెందిన ఓ కాస్టింగ్ డైరక్టర్ శీశాంత్ కు మోడల్స్ ఫోటోలు పంపారని తెలుస్తోంది. సినిమాల్లోకి రావాలనుకుంటున్న వర్ధమాన మోడల్స్ ఫోటోలు శ్రీశాంత్ ల్యాప్ టాప్ లో దొరికాయి.

    స్పాట్‌ఫిక్సింగ్‌ ఆరోపణలతో అరెస్త్టెన శ్రీశాంత్‌ కంపెనీ 'ఎస్‌ 36'లో ఈ నిర్మాతకు భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

    ఎస్‌ 36 కంపెనీ.. మినరల్‌ వాటర్‌, క్రీడాసామగ్రి, దుస్తుల సరఫరా రంగంలో ఉంది. మరోవైపు, శ్రీశాంత్‌కు పలువురు మహిళా మోడల్స్‌ ఫొటోలు పంపించిన బాలీవుడ్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం ప్రశ్నించారు.

    ఎస్‌ 36 కంపెనీ ప్రకటనల కోసం మోడళ్లను ఎంపిక చేయటానికి శ్రీశాంత్‌ కావాలంటే ఫొటోలు పంపించానని ఆ వ్యక్తి చెప్పారన్నారు. శ్రీశాంత్‌ ఈమెయిల్‌ ఖాతాలో డజన్ల కొద్ది అమ్మాయిల ఫొటోలున్నాయని.. వీరిలో పలువురితో ఆయన సన్నిహితంగా మెలిగినట్లు తేలిందని ముంబయి పోలీసు వర్గాలు తెలిపాయి.

    English summary
    
 According to police, a Telugu film producer, who is believed to be in partnership with Sreesanth in the S36, has also been summoned. Mumbai police today grilled a casting director who sent photographs of models to S Sreesanth and has summoned a Telugu film producer having business links with the tainted India pacer for questioning in connection with its probe into the IPL spot-fixing scandal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X