బ్రేకింగ్: బాలీవుడ్ డ్రగ్ కేసులో టాలీవుడ్ నిర్మాత.. ఎన్సీబీ విచారణకు రక్త చరిత్ర ప్రొడ్యూసర్
బాలీవుడ్ డ్రగ్ రాకెట్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు బాలీవుడ్‌కే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌కు తాకింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసును విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తెలుగు సినీ నిర్మాత మధు మంతెనకు సమన్లు జారీ చేయడం సంచలనం రేపింది. మధు మంతెనపై వచ్చిన ఆరోపణలు ఏమిటి? టాలీవుడ్ నిర్మాతకు సంబంధించిన మరికొన్ని విషయాలు ప్రత్యేకంగా మీ కోసం..

మధు మంతెన నిర్మాతగా
టాలీవుడ్, బాలీవుడ్‌లో రాణిస్తున్న మధు మంతెన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు సమీప బంధువు. తెలుగులో కార్తీక్ అనే చిత్రం ద్వారా నిర్మాతగా మారారు. ఆ తర్వాత హిందీలో నిర్మాత అల్లు అరవింద్‌తో కలిస గజిని సినిమాను, ఆ తర్వాత రన్ చిత్రాన్ని రూపొందించారు. బెంగాళీలో ఆటోగ్రాఫ్, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రక్త చరిత్ర చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత జూటా హై సహీ, మౌసమ్ అనే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

బాలీవుడ్‌లో నిర్మాతగా పలు చిత్రాలు
బాలీవుడ్‌లో ఫాంటామ్ ఫిల్మ్స్‌తో కలిసి లుటేరా, క్వీన్, ఎన్‌హెచ్10, బాంబే వెల్వెట్, మసాన్, ఉడ్తా పంజాబ్, రామన్ రాఘవ్ 2.0, ట్రాప్డ్, హంటర్, అగ్లీ, షాన్‌దార్, మన్మర్జియాన్, సూపర్ 30 లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇటీవల రాంచరణ్‌తో ప్యాన్ ఇండియా మూవీగా రామాయణం సినిమాను తీస్తున్నట్టు అల్లు అరవింద్ ప్రకటించిన ప్రాజెక్టులో కూడా ఆయన సహ భాగస్వామిగా ఉన్నారు.

రిచ్చర్డ్స్, నీనా గుప్తా కూతురితో పెళ్లి
ఇక ప్రముఖ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, ప్రముఖ నటి నీనా గుప్తా సహజీవనం జీవితంలో కలిగిన సంతానం మసాబా గుప్తాను 2015లో వివాహం చేసుకొన్నారు. నాలుగేళ్ల దాంపత్య జీవితం తర్వాత ఆయన మసాబా నుంచి విడిపోయారు. అంతకుముందు అమర్త్యసేన్, నబనితా సేన్ దంపతుల కుమార్తె నందనసేన్‌తో పలు సంవత్సరాలు డేటింగ్ చేశారు.
Recommended Video

డ్రగ్ కేసులో మధు మంతెనకు నోటీసులు
తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్సీబీ అధికారులు నిర్మాత మధు మంతెనకు సమన్లు జారీ చేయడం సంచలనం రేపింది. సమన్లు అందుకొన్న మధు మంతెన బుధవారం విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం దీపిక పదుకోన్ మేనేజర్ కరిష్మాకు సమన్లు జారీ చేయగా, రియా చక్రవర్తి టాలెంట్ మేనేజర్ జయా సహాను విచారిస్తున్నారు. జయ సహాను త్వరలోనే అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు మీడియాలో జోరందుకొన్నాయి.


Click it and Unblock the Notifications











