టీడీపీ, జనసేన విజయం ఖాయం.. ఏపీ రాజకీయాలపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఏపీ రాజకీయాల్లో సంచలన రీతిలో పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీపై పడుతుందనే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వ మార్పు తప్పదని జోస్యం చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాత్మక రీతిలో సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి. అధికార వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. రానున్న రోజుల్లో ఇంకా రాజీనామాల వేగం పుంజుకొంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి రాజధాని కాదంటూ వైజాగ్‌లో కాపిటల్ పెడుతున్నారు. అమరావతి పరిధిలో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలనే కారణంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఈ రోజు అమరావతి, విశాఖపట్నం, కర్నూలులో రాజధాని లేకుండా ఏపీ ప్రజలు ఉన్నారు. కనుక వైసీపీ పార్టీలో రాజీనామాలు జరుగుతున్నాయి అని నట్టి కుమార్ చెప్పారు.

ఏపీలో పలు నియోజకవర్గాల్లో గెలువరనే ఉద్దేశంతో అమరనాథ్ అనకాపల్లి గెలువరనే ఉద్దేశంతో ఆయనను గాజువాకలో పోటీ చేయించేందుకు రెడీ చేస్తున్నారు. తిప్ప నాగిరెడ్డి కొడుకు, అలాగే ఆళ్ల రాజీనామాలకు కారణం కూడా ఓటమి భయమే. ఇది ఆరంభం మాత్రమే ఇంకా చాలా పరిణామాలు చేసుకొంటాయి అని నట్టి కుమార్ అన్నారు.

వైసీపీలో జరుగుతున్న పరిణామాలు తెలుగు దేశం, జనసేన పార్టీకి బలంగా మారాయి. తన వయసును కూడా లెక్క చేయకుండా పోరాటం చేస్తున్న చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. యువగళంలో లోకేష్ వెనుక నడుస్తున్న జనం చూస్తే పార్టీ గెలవడం ఖాయమనే భరోసా ఇస్తుంది అని నట్టి కుమార్ అన్నారు.


Click it and Unblock the Notifications











