Tollywood ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టు, విలక్షణ నటుడు చంద్ర మోహన్ చనిపోయిన వార్త మరవక ముందే మరో విషాదం జరిగింది. ప్రముఖ నిర్మాత యక్కలి రవింద్ర బాబు కన్నుమూశారు. ఆయన ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహారించారు. అనారోగ్య కారణాలతో ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న ఇండస్ట్రీ తీవ్ర దిగ్ర్బాంతికి గురైంది. ఆ వివరాల్లోకి వెళితే...
తెలుగు సినిమా పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ ఉదయం విలక్షణ నటుడు చంద్రమోహన్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్య కారణాల రీత్యా అపోలో ఆసుపత్రిలో కన్నూమూశారు. ఆయన మృతితో ఇండస్ట్రీ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోమవారం చంద్ర మోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన కుమార్తె అమెరికా నుంచి రావాల్సి ఉంది. సినీ ప్రముఖులు, అభిమానుల మధ్య చంద్ర మోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి.

ఇక చంద్ర మోహన్ మృతి మరవక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత కన్నుమూశారు. చంద్రమోహన్ మృతి నుంచి కోలుకోక ముందే... మరో నిర్మాత కూడా కన్నుమూయడం అందరినీ కలిచివేస్తుంది. శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా వ్యవహారిస్తున్న యక్కలి రవింద్ర బాబు కన్నూ మూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. చిన్న వయసులోనే చనిపోవడం అందరినీ దిగ్ర్భాంతికి గురి చేస్తుంది.
రవింద్ర బాబు సొంత ఊరు, గంగపుత్రులు లాంటి అవార్డు చిత్రాలు తెరకెక్కించారు. ఇక వీటితో పాటు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. అయితే రవింద్ర బాబు ఆరోగ్యం బాగాలేక... హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షిణించి... ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు.

ఇక రవింద్ర బాబు విషయానికి వస్తే.. ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం లో జన్మించారు. అక్కడే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఛార్టర్డ్ ఇంజనీర్ గా తన సేవలు అందించే వారు. ఇక తనకు సినిమా పట్ల ఉన్న ఇష్టంతో నిర్మాతగా మారారు. ఇక దాదాపు 17 చిత్రాలు నిర్మించి పలు అవార్డులు పొందారు.
ఇక తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ బాషాలలో కూడా సినిమాలు నిర్మించి.. అభిరుచి గల నిర్మాతగా పేరు గాంచారు. యక్కలి రవీంద్ర బాబుకి భార్య రమాదేవి, ఇద్దరు పిల్లలు ఉండగా.. ఆయన మరణ వార్త విని శోక సంద్రంలో మునిగిపోయారు. రవీంద్ర అంత్యక్రియల వివరాలు కుటుంబ సభ్యులు తెలుపలేదు... మరోపక్క చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. వరుసగా ఇండస్ట్రీలో సినీ ప్రముఖుల మృతితో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications











