twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్యాడ్ న్యూస్: అక్టోబర్ 1 నుంచి 'డబ్బింగ్ సినిమా' బ్యాన్

    By Srikanya
    |

    డబ్బింగ్ సినిమాల దెబ్బకు తెలుగు సినిమా పరిశ్రమ బెంబేలెత్తిపోతోంది. తాజాగా ఈ విషయమై ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతల మండలి సమావేశమై డబ్బింగ్ చిత్రాలపై వేటు వెయ్యాలని నిర్ణయించారు. కారణంగా...తెలుగు పరిశ్రమను బ్రతికించుకోవటం కోసమే అని చెప్తున్నారు. దాదాపు నాలుగున్నర గంటలు సేపు జరిగిన ఈ సమావేశంలో తెలుగు సినిమా బ్రతకాలంటే హాలీవుడ్ సినిమాల డబ్బింగ్ ని పూర్తిగా ఆపుచేయాలని,అలాగే భారతీయ చిత్రాల డబ్బింగ్ ని 50 ప్రింట్లకు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇన్నాళ్ళుగా ఎగ్జిబిటర్స్ కు ఈ డబ్బింగ్ చిత్రాలే చాలా వరకూ ఉపయోగపడుతున్నాయి అనేది నిజం.ఈ విషయం ఎవరూ ప్రస్దావించలేకపోవటం విచారకరం. ఇంకా చెప్పాలంటే కాస్త ఈ డబ్బింగ్ చిత్రాలు మాత్రమే లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అయితే తెలుగు సినిమాకు ధియేటర్స్ దొరకటం లేదనే సాకు చూపి ఈ డబ్బింగ్ ని ఆపుచేస్తున్నారు. అలాగే ఇప్పటికే కన్నడ పరిశ్రమలో డబ్బింగ్ చిత్రాలపై ఈ విధమైన కంట్రోలు ఉందని చూపుతున్నారు. అంతేగానీ జనాలు చూడగలిగే చిత్రాలు తీసే దిశలో ప్రయత్నం చేస్తామని, హీరోల రెమ్యునేషన్స్ తగ్గింపుపై చర్యలు తీసుకుంటామని చెప్పలేకపోయారు.

    ఇక సామాన్యులకు సైతం హాలీవుడ్ చిత్రాలు డబ్బింగ్ కావటంతో అందుబాటులోకి వచ్చి ప్రపంచ సినిమాని చూడగలుగుతున్నాడు. తమ లాభాల కోసం నిర్మాతలు ఈ అవకాశాన్ని తీసేస్తున్నారు. అయితే తాము డైరక్ట్ గా హాలీవుడ్ చిత్రాలు రిలీజ్ ఆపుచేయటం లేదని అంటున్నారు. అయితే ఇంగ్లీష్ లో రిలీజ్ చేస్తే ఎంతమంది ఆ సినిమాలు అర్దమవుతాయి..పోనీ ఇండస్ట్రీ వారైనా సబ్ టైటిల్స్ లేకుండా ఇంగ్లీష్ చిత్రాలను చూస్తున్నారా అంటే శూన్యం. అలాగే ఆ సినిమా డబ్బింగ్ చేసే కార్మికులు, నిర్మాతలు పరిస్ధితి ఏమిటనేది ఆలోచించలేని స్ధితిలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని అంతటా వినిపిస్తోంది. ఈ నిర్ణయం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రజనీకాత్ రోబో 500 ప్రింట్లతో రిలీజ్ కావటం మన నిర్మాతలను ఇబ్బందుల్లో పడేసిందని దీన్ని బట్టి అర్దమవుతోంది. జనాలకి నచ్చే సినిమాలు తీయలేక, హిట్టవుతున్న ఈ డబ్బింగ్ సినిమాలను ఆపుచేయటం ద్వారా మన తెలుగు నిర్మాతలు తెలుగు పరిశ్రమను బ్రతికిస్తారన్నమాట. మొత్తానికి తెలుగు వాడు ఏ సినిమా చూడాలో...అక్కర్లేదో మన నిర్మాతలు నిర్ణయిస్తారు..బావుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X