'ఛలో చెన్నై!' అంటున్న దర్శక, నిర్మాతలు
ఓ ప్రక్క ముఖ్యమంత్రి రోశయ్య తెలుగు సినీ పరిశ్రమకు హామీ ఇస్తున్నా ఎవరికీ ఇక్కడ షూటింగా చేసుకునేందుకు ధైర్యం సరిపోవటం లేదు. అందుకోసం వారంతా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్ ఫినిష్ చేయటానికి చెన్నై ప్రయాణం కట్టుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై సౌత్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వి.సి.గుహనాథన్ విశ్లేషిస్తూ...ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ లకు ఏర్పడుతున్న అవాంతరాల నేపథ్యంలో తెలుగు సినిమాల నిర్మాణం (షూటింగ్) కనీసం 25 శాతం వరకూ చెన్నైలో జరిగే అవకాశం ఉంది..ఇప్పటికే ప్రొడక్షన్ మేనేజర్లు కొందరు చెన్నైలోని మా వారితో సంప్రదింపులు జరుపుతున్నారు అని అన్నారు.
ఇక ఇదే విషయాన్ని తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు డి.రామనారాయణ ముందించినప్పుడు.. నిర్మాత ఒకసారి షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఎలాంటి అవాంతరం ఎదురైనా చాలా పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందనీ, షూటింగ్ ప్రాపర్టీ నష్టపోవడమే గాకుండా అగ్ర నటీనటుల కాల్షీట్లు మళ్లీ సంపాదించడం కష్టమవుతుందనీ ఆయన అన్నారు. ఈ పరిస్థితులు ప్రత్నామ్నాయ మార్గాల అన్వేషణకు దారితీస్తాయని స్పందించారు. ఇక మహేష్, మనోజ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ షూటింగ్ లపై ఇప్పటికే ఉద్యమకారులు విరుచుకుపడుతున్నారు. దాంతో వారి నిర్మాతలు కూడా ప్రత్యామ్నాయం కోసం అన్వేషించటం తప్పనిసరి అయింది.


Click it and Unblock the Notifications











