రామ్ 'బోల్ బచ్చన్' రీమేక్ టైటిల్ ఖరారు
హైదరాబాద్ : హిందీలో విజయవంతమైన 'బోల్ బచ్చన్' చిత్రాన్ని తెలుగులో పునర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ అజయ్‌దేవగణ్, అభిషేక్ బచ్చన్ పోషించిన పాత్రల్లో ఇక్కడ వెంకటేష్, రామ్ నటిస్తున్నారు.
అంజలి, సాజన్ పదమ్‌సీ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి 'గోల్‌మాల్' అనే పేరును నిర్ణయించారు. ఇదివరకు 'గరమ్ మసాలా' అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే 'గోల్‌మాల్' అయితేనే బావుంటుందని ఖరారు చేసారు.
ఈ విషయమై సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ''కథకు తగ్గట్టుగా ఉంటుందని 'గోల్‌మాల్' అనే పేరును ఖరారు చేశాం. దీనికి ఓ ఆసక్తికరమైన ఉపశీర్షిక కూడా జత చేయబోతున్నాం. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అందరికీ వినోదం పంచే సినిమా అవుతుంది''అని తెలిపారు.
ఇక ఈ చిత్రానికి విజయ్‌భాస్కర్.కె దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి రవికిషోర్ నిర్మాత. సురేష్‌బాబు సమర్పకులు. బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్‌సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు.'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్‌శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు.
అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. అందుకే తెలుగు వెర్షన్ కు గానూ గోల్ మాల్ అనే టైటిల్ ని పెట్టారు.


Click it and Unblock the Notifications











