ప్రేమ వ్యవహారం: గాయని మౌనికపై యాసిడ్ దాడి
హైదరాబాద్: ప్రేమ వ్యవహారాల్లో యాసిడ్ దాడులు జరుగుతుండటం ఈ మధ్య కాలంలో దేశంలో ఎక్కువయ్యాయి. తాజాగా ఇలాంటి కారణంతోనే మరో దాడి జరిగింది. అయితే ఈ సారి ఈ సంఘటన సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఉండటం గమనార్హం.
వర్ధమాన తెలుగు సినీ గాయని మౌనికపై యాసిడ్ దాడి జరిగింది. రెండు రోజుల క్రితం హైమద్ అనే వ్యక్తి ఆమెపై దాడి చేసాడు. ప్రేమను నిరాకరించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. బంజారాహిల్స్ పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. కేసును విచారిస్తున్నారు.

గత నెలలో....
జులై నెలలో కూడా నటిపై యాడిడ్ దాడి జరిగింది. దాడి చేసింది ఓ దర్శకుడు. భోజ్ పురి సినిమా పరిశ్రమలో రూపాలి (20), వికాస్ (19) అనే ఇద్దరూ సినిమా షూటింగ్ కోసం వచ్చి ఓ కాలేజి ప్రాంగణంలో నిద్రపోతుండగా అజయ్ కుమార్ అనే సినీ దర్శకుడు వచ్చి వాళ్ల మీద యాసిడ్ పోసి అక్కడి నుంచి పారిపోయాడు. తాను వద్దన్నా వినకుండా వికాస్ తో కలిసి నటిస్తున్నందునే అజయ్ ఈ దాడికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. ఉత్తరప్రదేశ్ లోని బలియా పట్టణం సమీపంలోని నారాయణ్ పూర్ విలేజ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.


Click it and Unblock the Notifications











