twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కెవ్వుకేక’ సింగర్....‘ఖుషి’ మురళి మృతి

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ప్రముఖ తెలుగు గాయకుడు మురళి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. బీచ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆయన సికింద్రాబాద్ నుంచి నిన్న గౌతమి ఎక్స్ ప్రెస్‌లో కాకినాడ బయల్దేరారు. కాకినాడ రైల్వేస్టేషన్‌కు చేరగానే ఆయనకు అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరేలోపు ఆయన తుదిశ్వాస విడిచారు.

    పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'ఖుషి' చిత్రంలో 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' పాట పాడిన మురళి...అప్పటి నుంచి 'ఖుషి మురళి'గా పాపులర్ అయ్యారు. ఇప్పటి వరకు ఆయన తెలుగులో కొన్ని వందల సినిమాలకు పాటలు పాడారు. తెలుగు స్టార్ హీరోల సినిమాల్లో ఆయన పాటలు తప్పనిసరయ్యాయి.

    మహేష్ బాబు హీరోగా వచ్చిన పోకిరి, ప్రభాస్ హీరోగా వచ్చిన 'మిస్టర్ పర్ ఫెక్ట్', ఇటీవల వచ్చిన పవన్ తాజా సినిమా 'గబ్బర్ సింగ్' చిత్రాల్లో మురళీ పాడిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఆయ పాడిన కెవ్వుకేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    మురళి ఆకస్మిక మరణంతో సంగీత అభిమానుల్లో విషాదం నెలకొంది. మురళి బాడీకి కాకినాడలోనే పోస్టు మార్టం నిర్వహించి హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికల్లా ఆయన మృతదేహం ఇక్కడికి చేరనుంది.

    English summary
    Famous Singer Telugu singer Murali died of a heart attack today at Kakinada. Murali Popular as khushi Murali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X