twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిన్న ఉదయ్ కిరణ్.. నేడు విజయ్ సాయి.. భార్గవి.. ప్రత్యూష అనుమానాస్పద మరణాలు

    By Rajababu
    |

    తెలుగు చిత్ర పరిశ్రమ వర్థమాన తారలకు అవకాశాల పుట్ట. సామాన్యమైన స్థాయి నుంచి వచ్చి అద్భుతమైన టాలెంట్‌తో మెగాస్టార్లుగా మారిన వారెందరూ సాక్ష్యాలుగా నిలిచారు. అదే సమయంలో అద్బుతమైన ప్రతిభ ఉండి కూడా విధి అనుకూలించకపోవడం వల్ల అర్ధాంతరంగా సినీ పరిశ్రమ నుంచి నిష్క్రమించిన వారు.. అలాగే అర్థాంతరంగా బలవన్మరణం పొందిన విషాద సంఘటనలు మన కళ్ల ముందు చోటుచేసుకొన్నాయి. అదే కోవలో ప్రతిభావంతుడైన నటుడు విజయ్ సాయి మరణం కూడా తెలుగు చిత్ర సీమను విషాదానికి గురిచేసింది. ఇలా అర్ధాంతరంగా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన వారిలో ఉదయ్ కిరణ్, భార్గవి, ప్రత్యూష తదితరులు ఉన్నారు.

    Recommended Video

    ఆ సంఘటన తర్వాతే ఆత్మహత్య ! విజయ్ తల్లి స్టేట్మెంట్..!
    విజయ్ సాయి హీరోగా

    విజయ్ సాయి హీరోగా

    పొట్టివాడైనా గట్టివాడనే భావనతో విజయ్ సాయి హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. తొలి రెండు మూడు సినిమాలతో ప్రతిభావంతుడైన హీరోగా గుర్తింపు తెచ్చుకొన్నారు. అబ్బాయిలు, అమ్మాయిలు, బ్యాక్‌పాకెట్, వరప్రసాద్ పొట్టి ప్రసాద్ లాంటి చిత్రాలతో అలరించాడు. అదే క్రమంలో అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆరిస్టుగా, కమెడియన్‌గా అవకాశాలను అందిపుచ్చుకొన్నాడు. వ్యక్తిగత, కుటుంబ కారణాల వల్ల డిసెంబర్ 12 (సోమవారం) ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయ్ మృతికి కారణం భార్యతో ఉన్న వివాదాలే అని తెలిసింది.

    ఉదయ్ కిరణ్ అర్థాంతరంగా

    ఉదయ్ కిరణ్ అర్థాంతరంగా

    ఎన్నో కోటి ఆశలతో సినిమా పరిశ్రమకు వచ్చిన వారిలో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు. తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమాతో టాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. వరుసగా నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసుకొన్నాడు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు వరుస పరాజయం పొందడంతో దాదాపు టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయాడు.

    భార్యతో కలతలు, విభేదాలు

    భార్యతో కలతలు, విభేదాలు

    కుటుంబ కలహాలు, భార్యతో విభేదాలు తలెత్తడంతో మానసికంగా చితికిపోయాడనే వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో 2014 జనవరి 5వ తేదిన హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం సినీ పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తింది.

    టెలివిజన్ నటుడు ప్రదీప్

    టెలివిజన్ నటుడు ప్రదీప్

    ఇటీవల కాలంలో ప్రదీప్ అనే టెలివిజన్ నటుడు కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. 2017 మే 3వ తేదీన తెల్లవారుజామున నార్సింగి సమీపంలోని అల్కాపురి కాలనీలో ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆయన ఆత్మహత్యకు భార్యే కారణమనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి.

    భార్యే కారణం అంటూ..

    భార్యే కారణం అంటూ..

    ప్రదీప్ మరణానికి కారణం భార్య అని కుటుంబ సభ్యులు కూడా పలు విమర్శలు చేశారు. మరణానికి ముందు భార్యతో ప్రదీప్ గొడవపడ్డారనే పోలీసులు కూడా పేర్కొన్నారు. ప్రదీప్ మృతిపై భార్య చెప్పిన కారణాలపై అనేక అనుమానాలు తలెత్తాయి.

    అనతికాలంలోనే భార్గవి నటిగా

    అనతికాలంలోనే భార్గవి నటిగా

    దర్శకుడు వైవీఎస్ చౌదరీ రూపొందించిన దేవదాసు చిత్రంతో యువ నటి భార్గవి టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇంద్రగంటి డైరెక్షన్‌లో వచ్చిన అష్టాచెమ్మా చిత్రంతో మంచి నటిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత భారీ చిత్రాల ఆఫర్లు కూడా వచ్చాయి. ఆమె నటించిన అమ్మమ్మ.కామ్ టెలివిజన్ సీరియల్‌కు కూడా మంచి రెస్సాన్స్ వచ్చింది.

    ప్రియుడితో కలిసి

    ప్రియుడితో కలిసి

    ఇలాంటి పరిస్థితుల్లో తన బాయ్‌ఫ్రెండ్ ప్రవీణ్ కుమార్‌తోపాటు భార్గవి తన ఫ్లాటోలో విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనలో తన ప్రియుడే చంపి.. తాను ఆత్మహత్యకు పాల్పడటం సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. ఈ ఘటన 2008 డిసెంబర్ 16న చోటుచేసుకొన్నది.

    మిస్టరీగా ప్రత్యూష మరణం

    మిస్టరీగా ప్రత్యూష మరణం

    అచ్చు తెలుగు ఆడపడుచులా కనిపించే ప్రత్యూష సినీ పరిశ్రమలో ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే తారాజువ్వలా దూసుకెళ్లాంది. శ్రీరాములయ్య, సముద్రం, రాయుడు లాంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇది ఏమి ఊరు రా బాబు, స్నేహమంటే ఇదేరా లాంటి సక్సెస్‌లు పలుకరించాయి.

    కూల్‌డ్రింక్‌లో విషం

    కూల్‌డ్రింక్‌లో విషం

    అయితే అనూహ్య పరిస్థితుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకొని 2002 ఫిబ్రవరిలో అనూహ్యంగా, అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఈ ఘటనలో తన బాయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ ప్రాణాలతో బయటపడ్డారు.

    దివ్యభారతి కూడా

    దివ్యభారతి కూడా

    అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన తారల్లో దివ్యభారతి ఒకరు. 16 ఏళ్ల వయసులో బొబ్బిలి రాజా చిత్రంతో దివ్యభారతి సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగులో సినిమాలు చేస్తూనే 1992లో విశ్వాత్మ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అనతికాలంలోనే తెలుగు తెరపైనే కాకుండా బాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా టాప్ రేంజ్‌కు చేరుకొన్నారు.

    బాల్కనీపై నుంచి పడి

    బాల్కనీపై నుంచి పడి

    ఉన్నతపథంలోకి దూసుకెళ్తుందని అందరూ అనుకుంటుండగానే 1993 ఏప్రిల్ 5వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో దివ్యభారతి మరణించారు. ముంబైలోని వెర్సోవాలోని తులసి బిలింగ్స్‌లోని ఓ ఫ్లాట్ బాల్కనీలో నుంచి కిందకు పడి మరణించారు. దివ్యభారతి మరణం సహజమరణం కాదనే రూమర్లు అప్పట్లో మీడియాలో ప్రముఖంగా వినిపించాయి.

    సౌందర్య కూడా

    సౌందర్య కూడా

    తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రతారగా వెలుగొందిన వారిలో సౌందర్య ఒకరు. ఆమె నటించిన రాజేంద్రుడు గజేంద్రుడు మంచి సక్సెస్ కావడంతో వరుస చిత్రాలను ఆమెను పలకరించాయి. అనతికాలంలోనే అగ్రహీరోలతో నటించి సావిత్రికి వారసురాలిగా పేరు తెచ్చుకొన్నది. హెలికాప్ఠర్ ప్రమాదంలో మరణించడంతో ఆమె జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.

    ఆర్తీ అగర్వాల్ మరణం

    ఆర్తీ అగర్వాల్ మరణం

    టాలీవుడ్‌లోని అగ్రతారల్లో ఆర్తీ అగర్వాల్ ఒకరు. పాగల్‌పన్ అనే చిత్రంతో ఆర్తీ బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి ప్రవేశించి వెంకటేష్‌తో నువ్వు నాకు నచ్చావ్, చిరంజీవితో ఇంద్ర, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రవితేజ, తరుణ్ తదితర హీరోలతో నటించారు. అప్పట్లో ఓ హీరోతో అఫైర్ బెడిసికొట్టడం, సినిమా అవకాశాలు లేకపోవడంతో శరీరకంగా, మానసికంగానూ దెబ్బతిన్నారు. లావు తగ్గడానికి చికిత్స చేసుకొనే క్రమంలో ఆమె మరణించడం విషాదంగా మారింది.

    రోడ్డు ప్రమాదంలో యశోసాగర్

    రోడ్డు ప్రమాదంలో యశోసాగర్

    అర్థాంతరంగా మరణంపాలైన వ్యక్తుల్లో యశో సాగర్ ఒకరు. 2008లో ఆయన నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఆడకపోవడంతో కన్నడ రంగానికి పరిమితం అయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తూ 2012 డిసెంబర్ 25న రోడ్డు ప్రమాదంలో మరణించారు.

    English summary
    Telugu actor Vijay Sai was found dead at his residence in Jubilee Hills, Hyderabad. Local media reported that the actor killed himself as he was not getting work in films anymore. The comedian was well know for his roles in films such as Nuvve Kavali, Bommarillu, Swathi Keertanam and more. Like Vijay so many stars who died unfortunate deaths. While it is unmistakably sad, cinema is the only field that lets you live forever.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X