2009 సూపర్ హిట్ చిత్రాలు లిస్ట్
మగధీర
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఈ యేటి మేటి క్రౌడ్ ఫుల్లర్ అనటంలో సందేహం లేదు. గ్రాఫిక్స్ ప్రధానంగా ఈ చిత్రం రూపొందినా రామ్ చరణ్ అభినయం, కజల్ అందచందాలు,కీరవాణి కిక్కిచ్చే పాటలు ఈ చిత్రాన్ని టాప్ ప్లేస్ లో నిలబెట్టాయి.
అరుంధతి
2009 లో జెన్యూన్ హిట్ చిత్రం ఏది అంటే తడుముకోకుండా చెప్పే చిత్రం అరుంధతి. అనూష్క ప్రధానపాత్రలో వచ్చిన ఈ చిత్రంలో కథ, కథనం, గ్రాఫిక్స్ హీరోల్లా కీ రోల్ పోషించాయి. సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే మౌత్ టాక్ తో చెలరేగిపోయింది. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది.
కిక్
రవితేజ, ఇలియానా కాంబినేషన్లో సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కామిడీతో దూసుకెళ్ళిపోయింది. మొదట్లో డివైడ్ టాక్ తెచ్చుకున్నా తర్వాత అధ్బుతమైన కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఈ చిత్రంతో దర్శకుడు సురేంద్రరెడ్డి క్రేజ్ మరికాస్త పెరిగింది. అతనొక్కడే దర్శకుడు అనిపించుకుంటూ వస్తున్న ఆయన కిక్ దర్శకుడుని అని గర్వంగా చెప్పుకునే పరిస్ధితి ఏర్పడింది.
బెండు అప్పారావు ఆర్.ఎం.పి
అల్లరి నరేష్ హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం వరస ఫ్లాఫుల్లో ఉన్న పరిశ్రమకు ధైర్యాన్నిచ్చింది. కాస్త బాగా తీసినా అద్బుతంగా ప్రేక్షకులు ఆదరించటానికి రెడీగా ఉన్నారనే విషయాన్ని ఈ చిత్రం ప్రూవ్ చేసింది.
ఈ యేటి మేటి చిత్రాలుగా నిర్మాతలకు సొమ్ము చేసి పెట్టిన ఈ నాలుగు చిత్రాలలో రెండు(మగధీర,అరుందతి) గ్రాఫిక్స్ ఫ్రధానం కాగా మిగిలిన రెండూ (కిక్, బెండు అప్పారావు) కామిడి ప్రధానంగా నడుస్తూ అలరించటం విశేషం. ఇక మిగతా చిత్రాల్లో కొన్ని నిర్మాతలకు డబ్బు తెచ్చిపెట్టి యావరేజ్ అనిపించుకున్నాయి తప్ప పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయాయి.


Click it and Unblock the Notifications











