twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన హీరోలు డొల్ల.. ఎవడైనా గుద్దితే దేనికి పనికిరారు.. కౌన్సిలింగ్ ఇప్పించాలి.. ఓ టీవీ ఛానెల్ కథనం..

    By Rajababu
    |

    Recommended Video

    Chiranjeevi Decision To Ban Media Promotions..Goes Controversial

    టాలీవుడ్‌ను నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్, రాంగోపాల్ వర్మ వివాదం కుదిపేస్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని టీవీ ఛానెళ్లు సినీ నటులపై కథనాలు ప్రసారం చేయడంపై ఇండస్ట్రీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని న్యూస్ ఛానెళ్ల తీరు సినీ పరిశ్రమ వర్గాలను కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీకి వ్యతిరేకంగా వస్తున్న కథనాలపై సినీ పరిశ్రమ పెద్దలు చర్చించారు.

    ఈ క్రమంలోనే కొన్నిరోజులుగా ఇండస్ట్రీకి సంబంధించిన వర్గాలు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి అధ్వర్యంలో దాదాపు 25 మంది హీరోలు సమావేశమై టెలివిజన్ చానెళ్లను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నాయి. సినీ హీరోల నిర్ణయంపై ఓ టెలివిజన్ ఛానెల్ తీవ్రంగా స్పందించింది. సినీ హీరోలు తీసుకొన్న నిర్ణయాన్ని ఎండగట్టింది. సదరు టెలివిజన్ చానెల్లో ప్రసారమైనట్టు వస్తున్న వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఆ వీడియో కథనం ఏమిటంటే..

     టీవీ ఛానెళ్లపై బహిష్కరణ అట!

    టీవీ ఛానెళ్లపై బహిష్కరణ అట!

    సినిమాలు తీసేవాళ్లు న్యూస్, టెలివిజన్ ఛానెళ్లను బహిష్కరిస్తారట. సో ఇక నుంచి న్యూస్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వబోము అంటూ డజన్‌కు కథానాయకుల వేషాలు వేసేవాళ్లంతా హైదరాబాద్‌లో సమావేశమై నిర్ణయం తీసుకొన్నారు.

    సొంత డబ్బాలు కొట్టుకొనే

    సొంత డబ్బాలు కొట్టుకొనే

    న్యూస్ ఛానెళ్లను బ్యాన్ చేద్దామనే నిర్ణయం మంచిదే. వీళ్ల హిపోక్రాటిక్ ప్రకటనలు, సొంత డబ్బాలు కొట్టుకునే ఇంటర్వ్యూలు. అలాగే నన్ను నీవు పొగుడు. నేను నిన్ను పొగుడుతా అనే ఆడియో ఫంక్షన్ల ప్రహసనాలు. మా కుటుంబం గొప్పది అంటే మా కుటుంబం గొప్పది అని వీరావేశంతో చెప్పుకొనే బెడద ప్రేక్షకులకు తప్పుతుంది. వాటిని భరించాల్సిన ఖర్మ తప్పుతుంది.

    హీరోల వ్యక్తిత్వ లోపాలకు నిదర్శనం

    హీరోల వ్యక్తిత్వ లోపాలకు నిదర్శనం

    ఇండస్ట్రీలోని ఇంత మంది నటులు పెద్దలు సమావేశమైతే పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను, క్యాస్టింగ్ కౌచ్ లాంటి విషయాలపై మాట్లాడుకొని పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్లు మాత్రం మమల్ని వ్యతిరేకిస్తున్నారు కనుక ఫలాన వాళ్లను బహిష్కరిస్తామని నిర్ణయం తీసుకోవడం వారి వ్యక్తిత్వ లోపాలను కనిపిస్తున్నది.

     తెలుగు హీరోలకు సామాజిక బాధ్యత లేదు..

    తెలుగు హీరోలకు సామాజిక బాధ్యత లేదు..

    తెలుగు నటీనటుల్లో సామాజిక బాధ్యత ఉన్నట్టు కనిపించదు. వీళ్ల ముందు రాంగోపాల్ వర్మ, ప్రకాశ్ చాలా బెటర్ అనిపిస్తుంది. అప్పడప్పుడు వారు అనాలోచితంగా మాట్లాడినప్పటికీ.. మెజార్టీ ఆఫ్ ది టైమ్స్ బాధ్యత మాట్లాడుతారు. తమిళ నటీనటుల్లో సామాజిక బాధ్యత ఉన్నట్టు ఎక్కువ కనిపిస్తుంది. తమిళ నటీనటులు సమస్యలపై గళమెత్తుతారు. ఉద్యమించిన దాఖలాలు ఉన్నాయి. తమిళ సమాజానికి హాని కలిగినట్టు అనిపిస్తే వారు ప్రభుత్వాలను నటీనటులు నిలదీస్తారు.

     ఎక్కడో పై నుంచి ఊడిపడినట్టు

    ఎక్కడో పై నుంచి ఊడిపడినట్టు

    తెలుగు నటీనటులు మాత్రం ఎక్కడ నుంచి దిగివచ్చినట్టు, దైవాంశ సంభూతులన్నట్టు, సామాజిక అంశాలు పట్టవు అన్నట్టు ప్రవర్తిస్తుంటారు. అంతేకాకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి సమావేశమవుతారు. ఇది వీళ్ల డొల్లతనం. వీళ్లను హీరోలు అనవద్దు. జీరోలు అనాలి. మైనస్ నటీనటులు, మైనస్ పర్సనాలిటీలు అని పిలువాలి.

    హీరోలు పనికిరాని బ్యాచ్

    హీరోలు పనికిరాని బ్యాచ్

    ఇక నుంచి తెలుగు హీరోలను మైనస్ పర్సనాలిటీలు అని పిలువాలి. ఆ హీరో, ఆ స్టార్, ఈ స్టార్ అనిపిలువవద్దు. వీరు చేసిందేంది బూడిద. ఎందుకు పనికిరాని బ్యాచ్. బయట కరెక్ట్‌గా ఎవడైనా వచ్చి లాగి గుద్దితే దేనికి పనికిరారు. తెర మీద చింపేసినట్టు వందమందిని చితకబాదేస్తుంటారు. ఇదీ వాళ్ల గొప్ప గొప్పతనం, డంబ ప్రయత్నాలు. ఇప్పటికైనా ఎదిగే ప్రయత్నం చేయండిరా నాయనా. సైక్రియాటిక్ కౌన్సిలింగ్‌కు అయినా వెళ్లండి. సమాజంలో మనుషులుగా బతుకుతున్నామా అని ఓ సారి ఆలోచించించుకొండి.

     అభిమానులకు కనువిప్పు కలగాలి

    అభిమానులకు కనువిప్పు కలగాలి

    న్యూస్ ఛానెళ్లను బహిష్కరించడం హీరోల తీరు ఫ్యాన్సుకు కనువిప్పు కలిగించే చర్య కావాలి. మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప అని కొట్టుకొవడం, కులంపరంగా తగాదాలు పెట్టుకొంటారు. చచ్చిపోతుంటారు. అలాంటి మారాల్సిన పరిస్థితి ఉందని మెసేజ్ ఇచ్చారు. వ్యక్తిగతంగా మాకు ఏవైనా సమస్యలు వస్తే మేమంత ఒక్కటైతాం. మీరంత రోడ్లమీద పడి కొట్టుకు చస్తారు అని హీరోలు మెసేజ్ ఇచ్చారు. దీనిని హీరోల అభిమానులందరూ గమనించాలి.

    కౌన్సెలింగ్ వెళ్లండి..

    కౌన్సెలింగ్ వెళ్లండి..

    హీరోలు అంటే మన జీవితాన్ని మార్చే వ్యక్తులుగా ఉండాలి. ఎక్కడో తెర మీద తైతక్కలాడే వాళ్లు అని గుర్తించాలి. హీరోలపై వెర్రి అభిమానాన్ని తగ్గించుకోవాలి. వినోదం అంటే జీవన సమస్యల నుంచి పక్కకు వెళ్లి ఆనందించే వినోదంగా భావించాలి. ఇలాంటి వాళ్లను హీరోలుగా భావించవద్దని వాళ్లు మెసేజ్ ఇచ్చారు. దీనిని మనం గమనిద్దాం. మనం కూడా వారికి మెసేజ్ ఇచ్చాం. కౌన్సిలింగ్ వెళ్లండి. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడం నేర్చుకోండి అని సందేశం ఇచ్చే ప్రయత్నం చేద్దాం అని సదరు టీవీ ఛానెల్ పిలుపునిచ్చింది.

    English summary
    Casting couch, other issues became headache for Tollywood since few days. In this situation, a team headed by Chiranjeevi, taken decision to ban few Telugu Television Channels. In this junxture Telugu Television channel slams Tollywood Heroes decision.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X