సచిన్‌ను కలిసిన తెలుగు హీరోల ఆనందం(ఫోటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్‌: క్రికెట్‌ అభిమానులైన కొందరు తెలుగు హీరోలు హైదరాబాద్‌లో లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ను కలుసుకున్నారు. ఉప్పల్‌లో ఆస్ట్రేలియాపై విజయం తర్వాత సచిన్‌ ముంబాయి బయల్దేరే ముందు వారంతా ఆయన బసచేసిన హోటల్‌కు వచ్చారు.

నగరంలోని గ్రాండ్‌ కాకతీయ హోటల్‌లో సచిన్‌ని కలిసి కాసేపు ముచ్చటించారు. ఆ సందర్భంలో సీసీఎల్‌ పోటీలు, ఆట తీరు ప్రస్తావనకొచ్చింది. తెలుగు జట్టుకి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాంత్‌, తరుణ్‌, చరణ్‌తేజ్‌, రఘు, నిఖిల్‌, ఆదిత్య, సామ్రాట్‌, జట్టు మార్గదర్శకుడు చాముండేశ్వరీనాథ్‌, కోచ్‌ వంకా ప్రతాప్‌ తదితరులు సచిన్‌ని కలిశారు. ఆ సందర్భంలోనే వీవీఎస్‌ లక్ష్మణ్‌తోనూ మన జట్టు ముచ్చటించింది.

సినీ తారల క్రికెట్‌లో తెలుగు వారియర్స్‌ తరపున పాల్గొంటున్న క్రికెటర్లు వీరిలో ఉన్నారు. సచిన్‌తో ఫోటోలు దిగి ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో తెలుగువారియర్స్‌ సాధిస్తున్న విజయాల గురించి సచిన్‌కు వివరించారు. సచిన్‌ను కలిసిన వారిలో హీరోలు శ్రీకాంత్‌, తరుణ్‌, నిఖిల్‌లతో పాటు వర్థమాన నటులు ఆదర్శ్‌, భరత్‌తో పాటు పలువురు తెలుగు వారియర్స్‌ ఆటగాళ్లు ఉన్నారు.

సచిన్‌ను కలిసిన తెలుగు హీరోల ఆనందం(ఫోటో ఫీచర్)

సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (సీసీఎల్‌) పోటీల్లో నెగ్గుకొస్తున్న తెలుగు సినీ నటులు... క్రికెట్‌ స్టార్‌ సచిన్‌ టెండూల్కర్‌ని కలిశారు

సచిన్‌ను కలిసిన తెలుగు హీరోల ఆనందం(ఫోటో ఫీచర్)

సచిన్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనను కలిసే అవకాశం రాగానే ఎంతో సంతోషపడి కరచాలనం చేసేసారు మన హీరోలు.

సచిన్‌ను కలిసిన తెలుగు హీరోల ఆనందం(ఫోటో ఫీచర్)

తమ అభిమాన ఆటగాడిని కలిస్తే... ఆ క్షణాలను మధురానుభూతులుగా భావిస్తున్నామని చెప్తున్నారు.

సచిన్‌ను కలిసిన తెలుగు హీరోల ఆనందం(ఫోటో ఫీచర్)

మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆవిష్కృతమైన ఈ ఘట్టం సినీ హీరోలకు పండుగ చేసిందనే చెప్పాలి.

సచిన్‌ను కలిసిన తెలుగు హీరోల ఆనందం(ఫోటో ఫీచర్)

నగరంలోని గ్రాండ్‌ కాకతీయ హోటల్‌లో సచిన్‌ని కలిసి కాసేపు ముచ్చటించం తాము మర్చిపోలేమంటున్నారు.

సచిన్‌ను కలిసిన తెలుగు హీరోల ఆనందం(ఫోటో ఫీచర్)

సినీ స్టార్స్ కనిపించగానే అభిమానులు కేరింతలు కొడతారు. స్టార్స్ తాము అభిమానించే వ్యక్తులు కలిసినప్పుడు ఆనందం ఇలాగే... వ్యక్తం చేస్తారు.

సచిన్‌ను కలిసిన తెలుగు హీరోల ఆనందం(ఫోటో ఫీచర్)

ఈ ప్రత్యేక సందర్భంలో సీసీఎల్‌ పోటీలు, ఆట తీరు ప్రస్తావనకొచ్చింది.

సచిన్‌ను కలిసిన తెలుగు హీరోల ఆనందం(ఫోటో ఫీచర్)

సచిన్ ...తెలుగు జట్టుకి శుభాకాంక్షలు తెలిపారు.

సచిన్‌ను కలిసిన తెలుగు హీరోల ఆనందం(ఫోటో ఫీచర్)

శ్రీకాంత్‌, తరుణ్‌, చరణ్‌తేజ్‌, రఘు, నిఖిల్‌, ఆదిత్య, సామ్రాట్‌, జట్టు మార్గదర్శకుడు చాముండేశ్వరీనాథ్‌, కోచ్‌ వంకా ప్రతాప్‌ తదితరులు సచిన్‌ని కలిశారు.

సచిన్‌ను కలిసిన తెలుగు హీరోల ఆనందం(ఫోటో ఫీచర్)

ఆ సందర్భంలోనే వీవీఎస్‌ లక్ష్మణ్‌తోనూ మన జట్టు ముచ్చటించింది.

సచిన్‌ను కలిసిన తెలుగు హీరోల ఆనందం(ఫోటో ఫీచర్)

సచిన్‌తో ఫోటోలు దిగి ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు.

సచిన్‌ను కలిసిన తెలుగు హీరోల ఆనందం(ఫోటో ఫీచర్)

సచిన్ ని ఇలా కలవటం అదీ క్రికెట్ ఆడుతున్న సమయంలో మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని హీరోలు చెప్పారు.

శనివారం హైదరాబాద్‌లో సీసీఎల్‌ సెమీఫైనల్స్‌ జరుగుతాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియమ్‌ ఇందుకు వేదికగా నిలుస్తుంది. ఈ పోటీలను తిలకించేందుకు రూ.100, రూ.300, రూ.500 టిక్కెట్లను ఈసేవా కేంద్రాల ద్వారా విక్రయిస్తున్నట్లు సీసీఎల్‌ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X