క్రికెట్ ప్రాక్టీస్ లో 'రామ్ చరణ్ అండ్ కో' రచ్చ (ఫోటోలతో...)

By Srikanya

హైదరాబాద్‌: 'రచ్చ' చిత్రంలో క్రికెట్ బ్యాట్ పట్టి అదరకొట్టిన రామ్ చరణ్ నిజ జీవితంలోనూ బ్యాట్ పట్టి...కేక పెట్టిస్తున్నారు. తారల క్రికెట్‌ లీగ్‌(సీసీఎల్‌) దగ్గర పడుతుండటంతో మంగళవారం తెలుగు సినీనటులు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. ఈ ప్రాక్టీస్‌లో తెలుగు వారియర్స్‌ క్రీడాకారులు వెంకటేష్‌, రామ్‌చరణ్‌, శ్రీకాంత్‌, తరుణ్‌, నిర్మాత సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 9 నుంచి సీసీఎల్‌ 3 ఆరంభంకానుంది. తెలుగు వారియర్స్‌ మ్యాచ్‌లు ఫిబ్రవరి 10 నుంచి మొదలవుతాయి. ఈ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు మన హీరోలు చెప్తున్నారు.

దేశంలోని వివిధ సినీరంగాలకు చెందిన స్టార్స్ అంతా కలిసి ఆడుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సిసిఎల్) గత రెండు సీజన్లు మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సారి సిసిఎల్-3 టోర్నీ కూడా గ్రాండ్ గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో వీక్షించండి.

క్రికెట్ ప్రాక్టీస్ లో 'రామ్ చరణ్ అండ్ కో' రచ్చ (ఫోటోలతో...)

సీసీఎల్‌ 3లో రామ్‌చరణ్‌ తెలుగు వారియర్స్‌ జట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

క్రికెట్ ప్రాక్టీస్ లో 'రామ్ చరణ్ అండ్ కో' రచ్చ (ఫోటోలతో...)

రీసెంట్ గా హిట్ కొట్టిన వెంకటేష్ ఎంతో ఉత్సాహంగా ఈ ప్రాక్టీస్ లో పాల్గొన్నారు.

క్రికెట్ ప్రాక్టీస్ లో 'రామ్ చరణ్ అండ్ కో' రచ్చ (ఫోటోలతో...)

శ్రీకాంత్ చాలా ధీమాగా తన సత్తా చూపి శభాష్ అనిపించుకుంటానంటున్నారు.

క్రికెట్ ప్రాక్టీస్ లో 'రామ్ చరణ్ అండ్ కో' రచ్చ (ఫోటోలతో...)

సినిమాల్లో మిస్సైపోయిన తరుణ్ ఇలా..గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తూ..మళ్లీ తెరపైకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

క్రికెట్ ప్రాక్టీస్ లో 'రామ్ చరణ్ అండ్ కో' రచ్చ (ఫోటోలతో...)

వీరి స్నేహానుభంధం చూస్తూంటే భవిష్యత్ లో రామ్ చరణ్ సినిమాలో శ్రీకాంత్ కనిపిస్తాడనిపిస్తోంది.

క్రికెట్ ప్రాక్టీస్ లో 'రామ్ చరణ్ అండ్ కో' రచ్చ (ఫోటోలతో...)

తెలుగు సినీ పరిశ్రమ తరుపున వెంకటేష్ కెప్టెన్సీలో ‘తెలుగు వారియర్స్' జట్టు బరిలోకి దిగుతుండగా వివిధ సినీ రంగాల ముంబై హీరోస్, చెన్నై రైనోస్, కర్నాటక బుల్డోజర్స్, కేరళ స్టైకర్స్, బెంగాల్ టైగర్స్, వీర్ మరాఠి, భోజ్ పురి దబాంగ్స్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి.

క్రికెట్ ప్రాక్టీస్ లో 'రామ్ చరణ్ అండ్ కో' రచ్చ (ఫోటోలతో...)

బ్యాటింగే కాదు..బౌలింగ్ అదరకొడతా..సత్తా చూపిస్తా అంటున్నాడు తరుణ్

క్రికెట్ ప్రాక్టీస్ లో 'రామ్ చరణ్ అండ్ కో' రచ్చ (ఫోటోలతో...)

నిర్మాతగానే కాదు... క్రికెట్ లోనూ సిక్సర్సే అంటున్నట్లుంది సురేష్ బాబు ఉషారు చూస్తుంటే..

క్రికెట్ ప్రాక్టీస్ లో 'రామ్ చరణ్ అండ్ కో' రచ్చ (ఫోటోలతో...)

సినిమాలే కాదు...క్రికెట్ గ్రౌండ్ లోనూ మగధీరుడే...

క్రికెట్ ప్రాక్టీస్ లో 'రామ్ చరణ్ అండ్ కో' రచ్చ (ఫోటోలతో...)

టాలీవుడ్ వారియర్స్ జట్టు సభ్యుల పేర్లు వారు ధరించే జెర్సీ నెంబర్లతో సహా...వెంకటేష్ (1), శ్రీకాంత్ (5), తరుణ్ (7), రామ్ చరణ్ తేజ్(33), నితిన్(23), రఘు(32), అజయ్(26), రాజీవ్ కనకాల(13), నిఖిల్(27), కార్తీక్(3), సామ్రాట్ (10), ఆదర్శ్(69), ప్రిన్స్(36), నందకిషోర్ (6), విశ్వ(45), హర్ష(99), సన్నీ(8), తేజ(666), గిరి (28),ఆదిత్య (34).

క్రికెట్ ప్రాక్టీస్ లో 'రామ్ చరణ్ అండ్ కో' రచ్చ (ఫోటోలతో...)

ఫిబ్రవరి 9 నుంచి CCL-3 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కేరళలోని కోచ్చిలో జరుగనుంది. మార్చి 10న బెంగుళూరులో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దేశంలోని వివిధ నగరాల్లో మ్యాచ్ లు జరుగనున్నాయి. తాజాగా ఆ మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ రిలీజైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X