Just In
- 34 min ago
రామ్ ఖాతాలో అరుదైన రికార్డ్.. సౌత్ ఇండియాలోనే మొదటి హీరోగా ఘనత.. అందులో బన్నీదే టాప్ ప్లేస్
- 1 hr ago
బాలీవుడ్‌లోకి విజయ్.. లాంచ్ చేయనున్న డైనమిక్ డైరెక్టర్.. కరణ్‌తో చర్చలు సఫలం
- 1 hr ago
విజయ్ దేవరకొండతో ఆలియా భట్ రొమాన్స్.. పూరి ప్లాన్!
- 2 hrs ago
ఆ విషయంలో సన్నీలియోన్‌తో పోటీపడిన కాజల్.. చివరకు పైచేయి ఎవరిదంటే!
Don't Miss!
- Sports
కోహ్లీ, బుమ్రాలే స్ఫూర్తి.. టీ20 ప్రపంచకప్ ఆడటమే లక్ష్యం!!
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- News
Citizenship Bill: సరైన అవగాహనే లేదంటూ యూఎస్ ప్యానెల్‌కి భారత్ కౌంటర్
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Lifestyle
సెక్సియెస్ట్ ఏషియన్ మెన్ జాబితాలో యంగ్ రెబల్ హీరో ప్ర‘భాస్‘ స్థానం ‘పది‘లం..
- Finance
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, కారణమిదే
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
తెలుగు సినీ రచయిత కన్నుమూత
చెన్నై : పాటల, కథా రచయిత పొందూరి హనుమంతరావు (49) సోమవారం సాయంత్రం చెన్నైలో మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఉలిచి గ్రామానికి హనుమంతరావు చిన్నతనం నుంచే రచనపై మక్కువ పెంచుకున్నారు. 23 ఏళ్ల క్రితం చెన్నైలో స్థిరపడిన ఆయన పలు బుల్లితెర ధారావాహికలకు కథలు రాశారు.
శ్రీకాంత్ హీరోగా నటించిన 'వూహ' చిత్రానికి ఆరు పాటలు కూడా రాశారు. కోడిరామకృష్ణ దర్శకత్వంలోని 'లాఠీఛార్జి'కి కొన్ని పాటలు రాశారు. ఇటీవల నాగార్జున నటించిన 'షిరిడి సాయి'కి కథా సహకారం అందించారు. కేజే ఏసుదాస్ పాడిన అయ్యప్ప గీతగుచ్ఛాలకు సాహిత్యం కూడా సమకూర్చారు. కాణిపాక వినాయకుడితోపాటు పలు ఆధ్యాత్మిక గీతగుచ్ఛాలను కూడా రూపొందించారు.

చెన్నైలోని వడపళని, కుమరన్ కాలనీలో ఉంటున్న ఆయన.. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోయారు. సాయంత్రం 5.00 గంటలకు ఆయన కుమారుడు తలుపుతట్టగా తీయకపోవడంతో.. కిటికీలు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా నిర్జీవుడై ఉన్నారని బంధువులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు విశ్వనాథ్, సాయిసంతోష్‌లు ఉన్నారు.