twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సినీ రచయిత కన్నుమూత

    By Srikanya
    |

    చెన్నై : పాటల, కథా రచయిత పొందూరి హనుమంతరావు (49) సోమవారం సాయంత్రం చెన్నైలో మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఉలిచి గ్రామానికి హనుమంతరావు చిన్నతనం నుంచే రచనపై మక్కువ పెంచుకున్నారు. 23 ఏళ్ల క్రితం చెన్నైలో స్థిరపడిన ఆయన పలు బుల్లితెర ధారావాహికలకు కథలు రాశారు.

    శ్రీకాంత్‌ హీరోగా నటించిన 'వూహ' చిత్రానికి ఆరు పాటలు కూడా రాశారు. కోడిరామకృష్ణ దర్శకత్వంలోని 'లాఠీఛార్జి'కి కొన్ని పాటలు రాశారు. ఇటీవల నాగార్జున నటించిన 'షిరిడి సాయి'కి కథా సహకారం అందించారు. కేజే ఏసుదాస్‌ పాడిన అయ్యప్ప గీతగుచ్ఛాలకు సాహిత్యం కూడా సమకూర్చారు. కాణిపాక వినాయకుడితోపాటు పలు ఆధ్యాత్మిక గీతగుచ్ఛాలను కూడా రూపొందించారు.

    Telugu writer Pounduri Died

    చెన్నైలోని వడపళని, కుమరన్‌ కాలనీలో ఉంటున్న ఆయన.. సోమవారం మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోయారు. సాయంత్రం 5.00 గంటలకు ఆయన కుమారుడు తలుపుతట్టగా తీయకపోవడంతో.. కిటికీలు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా నిర్జీవుడై ఉన్నారని బంధువులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు విశ్వనాథ్‌, సాయిసంతోష్‌లు ఉన్నారు.

    English summary
    Ponduri Hanumantha rao assisted in writing the story 'Shirdi Sai' died yesterday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X