ఆగస్టు 15న హై వోల్టేజ్ మూవీస్.. ఇండిపెండెన్స్ డే వీక్ లో తెలుగు తెరపై హాట్ హీరోయిన్స్ మసాల మూవీస్!
వీకెండ్స్ వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, ఈ వీకెండ్ మాత్రం మూవీ లవర్స్ కు చాలా స్పెషల్. ఈ వీకెండ్ లో మోస్ట్ హాట్ బ్యూటీస్ నటించిన మూవీస్ విడుదల కావడంతో అన్ లిమిలెట్ ఎంటర్టైన్మెంటే.. వాస్తవానికి ఎక్కవ శాతం సినిమాలు శుక్రవారం రోజే విడుదల చేస్తారు. కానీ ఈ వారంలో గురువారం నాడు ఇండిపెండెన్స్ డే ఉండటంతో ఆ స్పెషల్ డే ను మరింత స్పెషల్ గా మార్చడానికి మూవీ మేకర్స్ ఫ్లాన్ వేశారు. ఆగస్టు 15న పబ్లిక్ హాలి డే రావడంతో ఆ రోజునే థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. ఇటు టాలీవుడ్.. అటు హాలీవుడ్ అనే తేడా లేకుండా .. మూవీ రిలీజ్స్ కు, ప్రీమియర్స్ షో లకు ఫ్లాన్ చేసారు మూవీ మేకర్స్. ఇంతకీ ఈ వారం తమ గ్లామర్ షోతో ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తున్న హాట్ హీరోయిన్స్ ఎవరో మీరు కూడా ఓ లూక్కేయండి.
ఆగస్టు 15వ తేదీన
మరో ఇంట్రెస్టింగ్ థింగేంటంటే.. మోస్ట్ స్టానింగ్, హాట్ బ్యూటీస్ నటించిన మూవీస్ అన్ని ఈ వారం విడుదల కావడంతో ఇక అన్ లిమిలెట్ ఎంటర్టైన్మెంటే.. ఆగస్టు 15 న టాలీవుడ్ లో దాదాపు మూడు సినిమాలతో పాటు ఒక సినిమా ప్రీమియర్స్ విడుదల కాకున్నది. అందులో డబుల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ అనే సినిమాలతో పాటు తంగలాన్ అనే డబ్బింగ్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నది. మరోసటి రోజు అంటే. . ఆగస్ట్ 16న ఆయ్ అనే సినిమా ప్రీమియర్ ప్రదర్శించేందుకు సిద్ధమవుతుంది.

డబుల్ ఇస్మార్ట్
ఇందులో ప్రధానంగా ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా 'డబుల్ ఇస్మార్ట్'. గతంలో వీరిద్దరి కాంబో వచ్చిన సూపర్ బూపర్ హిట్ మూవీ 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్ గా ఈ మూవీ వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. పూరి కనెక్ట్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. తన అందాల ఆరబోతతోనే తన నటనతో కూడా ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. మరోసారి తన హాట్ గ్లామర్ తో మాస్ ఆడియన్స్ కు పుల్ మీల్స్ వండించడానికి సిద్దమైంది. ఈ మూవీ ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది
మిస్టర్ బచ్చన్
ఈ వారం విడుదల కానున్న మరో మూవీ మిస్టర్ బచ్చన్ (Mr Bachchan). ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తుండగా.. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ మాస్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాయి. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు/ఎ (U/A) సర్టిఫికెట్ ఇచ్చిందంటే.. ఏ రేంజ్లో రొమాన్స్, యాక్షన్ తో మిస్టర్ బచ్చన్ ఎంటర్ టైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఆయ్
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె .. ఇప్పటికే మ్యాడ్ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన ఈ యంగ్ హీరో 'ఆయ్' అనే మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్ చూస్తే.. నార్నే నితిన్, నయన్ సారిక మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కట్ అయినట్టు కనిపిస్తుంది. ఈ జంట రోమన్సే కాదు. అందమైన లొకేషన్స్, బ్యాగ్రౌండ్‌తో అలరించే గోదావరి అందాలు ప్రేక్షకులను పుల్ ఎంటర్టైన్ చేయబోతున్నాయి. ఈ మూవీ కూడా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.


Click it and Unblock the Notifications











