విజన్ 2020 ని చంద్రబాబు నాయుడు మర్చిపోయాడని విమర్శిస్తున్న యువరాజ్యం అధ్యక్ష్యుడు పవన్ కళ్యాణ్ ముందు ఇంటర్ పాస్ అయితే మంచిదని తెలుగు యువత సూచించింది. చదువు లేనందువల్లే చంద్రబాబు విజన్ అర్ధం కావటం లేదని వారు తెలిపారు. అంతేగాక పవన్ కళ్యాణ్ కి స్ధిరత్వం లేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గతంలో స్ధాపించిన కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ ఏమైందని ప్రశ్నించారు. ఆ సంస్ధ పేరుతో వసూలు చేసిన నిధులు ఏమయ్యాయో వివరించాలని డిమాండ్ చేసారు. ఈ మేరకు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శులంతా కలిసి ఓ ప్రకటన విడుదల చేసారు.