జూ ఎన్టీఆర్ ఆ ఇద్దరితో సైకిల్ పై రొమాన్స్ అదుర్స్...
జూ ఎన్టీఆర్ సైకిల్ పై ముందు ఒకరిని, వెనకాల మరొకరిని ఎక్కించుకొని షికారుచేస్తూ ఇద్దరు భామలతో రొమాన్స్ చేస్తున్నాడనే వార్త అందరి నోట వినిపిస్తోంది. ఇది నిజామా? అబద్దమా? అని అడిగితే నిజమే అంటున్నారు. అయితే ఇదంతా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్, లక్ష్మీణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న 'బృందావనం" చిత్రంలో ఓ సీన్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్, సమంత నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం సన్నివేశ పోటోల్లో సైకిల్ పై ఎన్టీఆర్ ఇద్దరి నాయికలతో ఉన్న స్టిల్స్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్శిస్తోంది.
కాగా తన ప్రతి సినిమాలో తాత ఎన్టీఆర్ పేరునో, నందమూరి వంశం పేరునో లేక తెలుగుదేశం పార్టీ పేరునో, ప్రస్తావించే జూ ఎన్టీఆర్ బందావనం లో ఏకంగా తెలుగు దేశం గుర్తు సైకిల్ ను ఉపయోగించాడు. అందులో భాగంగానే సైకిల్ పై రొమాన్స్ సీన్ కు రూపకల్పన చేశారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











